Rajamouli – Mahesh Babu :  మీరు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ సినిమా అయ్యేదెప్పుడూ… రాజమౌళి వీడియోపై ట్రోల్స్ షురూ!

ఈ క్రమంలో మహేష్ బాబు మూవీ ఎప్పుడు విడుదల అవుతుందనే సందేహాలు ఫ్యాన్స్ లో ఉన్నారు. ఓ మూడేళ్లు అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వీలైనంత త్వరగా ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ పైకి వెళ్లాలని కోరుకుంటున్నారు.

Written By: NARESH, Updated On : April 12, 2024 8:43 pm

Rajamouli is not serious about Mahesh Babu movie

Follow us on

Rajamouli – Mahesh Babu : రాజమౌళి గొప్ప దర్శకుడు… అందులో ఎలాంటి సందేహం లేదు. మాస్ ఆడియన్స్ పల్స్ ఆయనకు తెలిసినంతగా మరొక దర్శకుడికి తెలియదు. నెంబర్ వన్ రేసులో ఈయనతో పోటీపడ్డవారు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు. రాజమౌళి మాత్రం అందరినీ దాటుకుని వెళ్ళిపోయాడు. రాజమౌళికి ఉన్న మరో పేరు జక్కన్న. ఎన్టీఆర్ తరచుగా ఇలానే పిలుస్తారు. ఇలా పిలవడం వెనుక ఆసక్తికర కారణం ఉంది. రాజమౌళికి ఒకపట్టాన ఏదీ నచ్చదు. ప్రతి సీన్ తనకు నచ్చినట్లు రావాల్సిందే. లేదంటే ఎన్ని టేకులైన తీసుకుంటాడు. జక్కన చెక్కినట్లు చెక్కుతాడు.

సాంకేతిక విషయాల్లో కూడా రాజమౌళి అసలు కాంప్రమైజ్ కాడు. ఈగ మూవీ సమయంలో ఈగ సీజీలో సహజంగా లేదని మరలా సమయం తీసుకుని పర్ఫెక్ట్ గా చేయించాడట. ఇందుకే రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుంది. మూడేళ్ళలో చేస్తాడనుకున్న బాహుబలి, బాహుబలి 2 పూర్తయ్యేనాటికి 5 ఏళ్ల సమయం పట్టింది. ఇక రెండేళ్లలో విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ నాలుగేళ్ళ సమయం తీసుకుంది. దాదాపు 25 ఏళ్ల కెరీర్లో రాజమౌళి చేసింది 12 సినిమాలే.

ఈ క్రమంలో మహేష్ బాబు మూవీ ఎప్పుడు విడుదల అవుతుందనే సందేహాలు ఫ్యాన్స్ లో ఉన్నారు. ఓ మూడేళ్లు అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వీలైనంత త్వరగా ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ పైకి వెళ్లాలని కోరుకుంటున్నారు. కాగా రాజమౌళి డాన్సులు వీడియోలు మహేష్ ఫ్యాన్స్ ని అసహనానికి గురి చేస్తున్నాయి. గతంలో ఓ వేడుకలో భార్యతో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ప్రేమికుడు సినిమాలోని ‘అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే’ సాంగ్ కి రాజమౌళి భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్స్ వేస్తున్నాడు. ఈ వీడియో క్రింద కామెంట్స్ చూస్తే మహేష్ ఫ్యాన్స్ అసహనం అర్థం అవుతుంది. మీరు ఇలా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మూవీ ఎప్పుడు పూర్తి చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆలస్యమైనా కూడా రాజమౌళి ఒక భారీ హిట్ ఇస్తాడు. తనతో పనిచేసే హీరో ఇమేజ్ పదింతలు పెరిగేలా చేస్తాడు. కాబట్టి రాజమౌళిని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని కొందరి వాదన…