Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా దర్శకులు సైతం వాళ్ళ మార్క్ ను చూపిస్తూ సినిమాలు చేయడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించే స్థాయికి ఎదగాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ సందర్భంలోనే రాజమౌళి (Rajamouli) లాంటి దర్శకుడు బాహుబలి (Bahubali) సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఆ తర్వాత ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో ఆస్కార్ రేంజ్ వరకు మన తెలుగు సినిమా ప్రయాణాన్ని కొనసాగించాడు. మరి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో మరోసారి భారీ ప్రభంజనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడితో సినిమా చేయడానికి యావత్ ఇండియన్ సినిమా యాక్టర్ లందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం. మరి ఇలాంటి సందర్భంలో ఆయన మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికి అది ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు షూట్ స్టార్ట్ చేశారు అనే విషయాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు… ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా షూట్లో మహేష్ బాబు కూడా పాల్గొనడాన్నే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన షూట్ ని నిర్వహిస్తున్నారట. మహేష్ బాబు మీద కొన్ని సీన్స్ ని చిత్రీకరించే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదిలా ఉంటే రీసెంట్ గా రాజమౌళి మహేష్ బాబు చెంప మీద కొట్టాడు అనే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…
నిజానికి ఆయన అలా కొట్టడానికి గల కారణం ఏంటి అంటే మహేష్ బాబు మీద ఫైట్ సీన్ అయితే చిత్రీకరిస్తున్నారట. మరి ఈ ఫైట్ సీన్ లో మహేష్ బాబు ని చెంప మీద కొట్టే షాట్ అయితే ఉంది. మహేష్ ను చేప మీద కొట్టడానికి రౌడీ సంకోచిస్తున్న సమయంలో రాజమౌళి మహేష్ బాబు చెంప మీద ఎలా కొట్టాలో చెబుతూ చాలా సింపుల్ గా కొట్టి చూపించారట.
దాంతో రాజమౌళి మహేష్ బాబు చెంప మీద కొట్టాడు అంటూ సోషల్ మీడియా లో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి ఏది ఏమైనా కూడా జక్కన్న ఏం చేసినా కూడా పబ్లిసిటీ స్టంట్ గా మిగిలిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి షూటింగ్ స్పాట్ ని చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్న రాజమౌళి పబ్లిసిటీ కోసం మహేష్ బాబు చెంప మీద కొట్టాడు అనే ఒక న్యూస్ ను మాత్రం విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…