Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతి సినిమాలో తన మార్క్ కనిపిస్తుంది. ప్రేక్షకులందరు మొదటి రోజు అతని సినిమాను చూసి కాలర్ ఎగిరేసుకుని మరి బయటికి వచ్చేలా అతని సినిమాలైతే ఉంటాయి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి సినిమా గ్రాఫ్ ని పెంచుతూ సినిమాను చూసే ప్రతి ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ ఇవ్వడంలో రాజమౌళి ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన ఆయన ప్రస్తుతం వారణాసి సినిమాతో మరోసారి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకునేలా చేసుకుంటున్నాడు.
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి షూటింగ్ స్పాట్లో చాలా సీరియస్ గా ఉంటారు. ప్రతి సన్నివేశాన్ని తను అనుకున్నట్టుగా తీసే వరకు ఒకటికి పది సార్లు రీ టేకులు చేస్తూనే ఉంటాడు. అలాంటిక్రమంలోనే రాజమౌళి ఒక ఇద్దరు హీరోలను మాత్రం షూటింగ్ స్పాట్లోనే కొట్టారట. కారణమేంటి అంటే వాళ్ళు చేసే అల్లరి పనుల వల్ల వాళ్లను కొట్టాల్సి వచ్చిందని కూడా తను గతంలో ఒక సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు.
ఇంతకీ ఆ హీరోలు ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కావడం విశేషం… ‘త్రిబుల్ ఆర్’ సినిమా షూటింగ్ సమయంలో వాళ్ళిద్దరు ఎంత చెప్పిన వినకుండా ఫన్నీగా కామెంట్లు చేసుకుంటూ షూటింగ్ సరిగ్గా చేయకపోవడంతో రాజమౌళి నవ్వుకుంటూ వెళ్లి వాళ్ళిద్దరిని వీపు మీద చెరో దెబ్బ వేసి షూటింగ్ అయితే స్టార్ట్ చేశారట.
దాంతో రాజమౌళి మీద కొంత సేపటి వరకు వాళ్ళు సీరియస్ అయినప్పటికి అది ఫన్నీ వే లోనే జరిగిందని షూటింగ్ స్పాట్లో ఉన్న చాలామంది ఆ తర్వాత పలు సందర్భాల్లో తెలియజేశారు. ఇక ఏదేమైనా కూడా రాజమౌళి తన హీరోలతో చాలా కేర్ఫుల్ గా ఉంటాడు. వాళ్లను తనుకు అనుకూలంగా మార్చుకొని తనకి ఏదైతే కావాలో అది షూట్ చేయడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు… అందుకే ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు తోనూ సూపర్ సక్సెస్ ని సాధించిన ఏకైక దర్శకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు…
