Rajamouli : ప్రస్తుతం రాజమౌళి ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్. స్టార్స్ తో చిత్రాలు చేసే రాజమౌళి వారి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. అయితే నాలుగు దశాబ్దాల క్రితమే ఓ తెలుగు దర్శకుడు స్టార్స్ తో సమానంగా, కొన్ని సినిమాలకు వారికి మించి రెమ్యూనరేషన్ తీసుకున్నారు. బాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా ఉన్న దర్శకుడి ఛార్జ్ చేసే దాని కంటే ఒక లక్ష ఎక్కువ తీసుకున్నారు. ఆ దర్శకుడు ఎవరు?
దర్శకధీరుడు రాజమౌళికి అపజయం అంటే తెలియదు. బాహుబలి తో దేశం తనవైపు చూసేలా చేశాడు. ఇక బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. వరల్డ్ వైడ్ బాహుబలి 2 రూ. 1800 కోట్ల వరకు రాబట్టింది. మొదటి వెయ్యి కోట్ల సినిమా ఇది. ఈ సక్సెస్ ట్రాక్ ని కొనసాగిస్తూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో మరో వెయ్యి కోట్ల సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లు రాబట్టింది. జపాన్ లో ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ రికార్డులకు ఎక్కింది.
Also Read : SSMB 29 లీక్… రాజమౌళి కావాలనే చేశాడా? తెరపైకి విస్తుగొలిపే విషయాలు!
ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకుడు రాజమౌళి. తన సినిమాలో నటించే హీరో కంటే ఆయన అధికంగా తీసుకుంటారు. అయితే 40 ఏళ్ల క్రితమే ఓ తెలుగు దర్శకుడు ఈ ఫీట్ సాధించాడు. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న దర్శకుడిగా పేరుగాంచాడు. ఆయన ఎవరో కాదు దాసరి నారాయణరావు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దాసరి నారాయణరావు రచయిత, దర్శకుడు, నటుడు. ఆయన కల్ట్ క్లాసిక్స్ తో పాటు మాస్ కమర్షియల్ చిత్రాలు చేశారు. వందల చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకుడు దాసరి. ఆయనకు దర్శకరత్న అనే బిరుదు ఉంది. ఇండస్ట్రీ పెద్దగా కూడా ఆయన వ్యవహరించారు. అనేక సమస్యలు పరిష్కరించారు. ఓ ఇంటర్వ్యూలో దాసరి తాను స్టార్ హీరోల కంటే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వెల్లడించాడు.
కటకటాల రుద్రయ్య సినిమాను హిందీలో జ్యోతి బనే జ్వాలా గా దాసరి రీమేక్ చేశారు. జితేందర్ హీరోగా నటించారు. నిర్మాతలు ఎంత రెమ్యూనరేషన్ కావాలి అని అడిగినప్పుడు.. హిందీ పరిశ్రమలో హైయెస్ట్ పేయిడ్ డైరెక్టర్ ఎవరని దాసరి వాళ్ళను అడిగారట. మన్మోహన్ దేశాయ్ అని వారు చెప్పారట. ఆయన తీసుకుంటున్న దాని కంటే ఒక లక్ష ఎక్కువ ఇవ్వాలని దాసరి చెప్పారట. నిర్మాతలు అందుకు అంగీకరించారట. కాబట్టి రాజమౌళి కంటే ముందే దాసరి దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న దర్శకుడు అన్నమాట.