
కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ మహమ్మరి కారణంగా jదేశంలో, రాష్ట్రంలో లాక్డౌన్ విధించారు. దీంతో సినిమా షూటింగులు, థియేటర్లు మూతపడగా సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. షూటింగులు నిలిచిపోవడంతో సినీ కార్మికులు రోజువారి ఉపాధిలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీరిని ఆదుకునేందుకు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ మనకోసం ఛారిటీని ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటున్నారు. సీసీసీకి సినీ ప్రముఖులు భారీగా విరాళాలు అందించడంతో మూడునెలలుగా కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.
జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు
ఇదిలా ఉంటే సినీపెద్దలు సినిమా షూటింగులు ప్రారంభించేలా తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు షూటింగులు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వం నిబంధనల మేరకు షూటింగులను చేసుకోవాలని సూచించారు. ఈనేపథ్యంలో ఇప్పటికే టీవీ షూటింగులు ప్రారంభమయ్యాయి. అయితే సినిమా షూటింగులు మాత్రం ప్రారంభం కాకపోవడం గమనార్హం. దర్శకులు సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్న స్టార్ హీరోహీరోయిన్లు కొద్దిరోజులు వేచిచూసే ధోరణిలో ఉండటంతో టాలీవుడ్లో ఇంకా షూటింగుల సందడి మొదలుకాలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి ట్రయల్ షూట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో షూటింగ్ ప్రారంభంకాలేదని తెలుస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ షూటింగులకు అన్ని అనుమతులు రావడంతో ఈనెల 25న ట్రయల్ షూట్ కు దర్శకుడు రాజమౌళి అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో రెండు రోజుల పాటు ట్రయల్ షూట్ చేయనున్నాడు.
చిరు పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!
ఈ ట్రయల్ షూట్లో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇతర నటీనటులతో షూటింగ్ చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ సిబ్బందితో షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎవరెవరూ ఏయే డిపార్ట్మెంట్లలో పని చేయాలో రాజమౌళి ప్లాన్ చేశారట. అదేవిధంగా సెట్లో థర్మామీటర్లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారట. ఈ ట్రయల్ షూట్లో మంచి రిజల్ట్స్ వస్తే.. రెగ్యులర్ షూటింగ్ కొనసాగించనున్నారు. లేకుంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది.