Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఇప్పుడు ఈయనను మించిన దర్శకుడు ఇండియాలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇంటా గెలిచిన తర్వాత రచ్చ గెలవమన్నట్టు రాజమౌళి మొదట తెలుగు లో సూపర్ సక్సెస్ సినిమాలను తీసి ఆ తర్వాత పాన్ ఇండియా సబ్జెక్ట్ లను ఎంచుకొని వరుస సక్సెస్ లను అందుకున్నాడు.
ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. దాంతో తెలుగు సినిమాని పాన్ వరల్డ్ సినిమాగా తీసి ముందుకు దూసుకెళ్తున్నందుకు మనందరం గర్వపడాలి. ఇక ఈ సినిమాతో తప్పకుండా ఆస్కార్ అవార్డు కొట్టబోతున్నాం అనే కాన్సెప్ట్ తో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మేకవర్ పనుల్లో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు. అలాగే రాజమౌళి కూడా ప్రి ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి పర్ఫెక్షన్ మహేష్ బాబుకి తలకాయ నొప్పిగా మారింది అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే మహేష్ బాబు స్టైల్ లో గానీ, బాడీ బిల్డింగ్ లో గాని రాజమౌళి ఎలా కావాలని కోరుకుంటున్నాడో అలాగే తను మేకోవర్ చేసి చూపించాలని ఆయన అంచనాలకి కొంచెం తగ్గిన కూడా తన పర్ఫెక్షన్ పోతుందనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఆయన చేత తీవ్రమైన కసరత్తులు చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది.
చాలా సినిమాల్లో ఒకే లుక్ తో కనిపించిన మహేష్ బాబు కొత్త మేకవర్లోకి షిఫ్ట్ అవ్వాలంటే చాలా సమయం పడుతుంది. కానీ రాజమౌళి మాత్రం ఎంత టైం తీసుకున్న పర్లేదు. కానీ తనకు అనుకున్న మెకోవర్ వచ్చేంతవరకు సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం లేదు. ఇక దాంతో మహేష్ బాబు ఏం చేయాలో తెలియక రాజమౌళి చెప్పినట్టుగానే చేస్తూ ముందుకు వెళ్తున్నాడు…
ఇక ఇది చూసిన చాలామంది సినిమా అభిమానులు ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందే మహేష్ బాబు అంత ఇబ్బంది పడుతుంటే మరి సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంకేన్ని ఇబ్బందులు పడతాడో అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…