SS Rajamouli Impact On Telugu Heroes Market: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి చేసిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీ కి పరిచయమైన ఆయన ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం వారణాసి సినిమాతో పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక రాజమౌళి మన స్టార్ హీరోలతో సినిమాలు చేయకముందు వాళ్ళ మార్కెట్ చాలా తక్కువగా ఉండేది.
ఒకసారి రాజమౌళి తో సినిమాలు చేసిన తర్వాత వాళ్ల మార్కెట్ పరిధి అనేది భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి… చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతో కేవలం 25 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టాడు.
ఇక తన రెండో సినిమా అయిన మగధీరతో 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాడు. 100 కోట్ల మార్కెట్లో చేరిన మొదటి తెలుగు హీరోగా పేరు సంపాదించుకున్నాడు…
ఇక బాహుబలి ముందు వరకు ప్రభాస్ మిర్చి సినిమాతో 40 కోట్ల క్లబ్లో మాత్రమే చేరాడు. కానీ బాహుబలి మొదటి పార్ట్ తో 500 కోట్ల మార్కును అందుకున్నాడు. ఇక రెండో పార్ట్ తో 1800 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాడు… ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో 1300 కోట్ల మార్కెట్లో చేరాడు. 150 కోట్ల మార్కెట్ మాత్రమే ఉన్న మహేష్ బాబుతో 1500 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తున్నాడు అంటే ఆయనకి ఎంత ఘట్స్ ఉండాలి.
ఇక ఈ మూవీ 3000 కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నాడు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒకవేళ తేడా కొడితే మాత్రం రాజమౌళికి భారీగా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మన స్టార్ హీరోల బ్రాండ్ వాల్యూ ని పెంచింది మాత్రం రాజమౌళి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…