Rajamouli: రాజమౌళి.. ఈ పేరు వింటేనే చాలు అన్ని ఇండస్ట్రీలు పోటీగా భావిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన సత్తా ఉన్న డైరెక్టర్ రాజమౌళి. ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ ను కూడా రుచి చూడలేదు. 12 సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి అన్ని సినిమాలతో హిట్ లనే రుచి చూశాడు. అందుకే ఈయన డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే.. ఇతర ఇండస్ట్రీలో కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన డైరెక్టర్ కూడా రాజమౌళినే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఈయన గురించి ప్రపంచం మొత్తం తెలిసింది.
అయితే రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. కానీ ఇప్పటికీ ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాల్లో హారర్ సినిమా ఒక్కటి కూడా లేదు. ఈయనకు హారర్, లవ్ సినిమాలు అంటే పెద్దగా నచ్చవట. అంతే కాదు కామెడీపై కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదట. అందుకే ఆ సినిమాలను తెరకెక్కించడానికి పెద్దగా దృష్టి పెట్టను అంటున్నారు జక్కన్న. ఈయన డైరెక్షన్ లో వచ్చిన ఈగ సినిమా గురించి గతంలోనే మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు రాజమౌళి. పాత వీడియో అయినా ప్రస్తుతం జక్కన్న చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
తన తండ్రి దగ్గర అసిస్టెంట్ గా పని చేసే సమయంలో ఈగ కథ గురించి చెప్పారట. అది విన్న జక్కన్న నవ్వుకున్నారట. ఇలా ఈగతో సినిమా చేయాలని ఎప్పుడు భావించలేదట. సింహాద్రి, ఛత్రపతి సినిమాలు తెరకెక్కిస్తున్న సమయంలోనే ఒక చిన్న సినిమా చేయాలని అనుకునేవారట జక్కన్న. అలా ఈగ సినిమా చేయాలనుకున్నారట. మొదట ఈ సినిమాను 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్లాన్ చేశారట. కానీ ఈగ సినిమా మొదలైన తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ గురించి తెలిసి మరింత ఖర్చు చేయాల్సిందే అనుకున్నారట.
జక్కన్నకు ఈగను చూసిన తర్వాత అసహ్యంగా అనిపించిందట. అయితే దాదాపుగా రూ. 10 కోట్ల ఖర్చైతే.. సీజీ కోసం కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లతో స్కెచ్ లు వేయించారట. మొత్తం మీద చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం ఇద్దరి స్టార్ల అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.. ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.