Rajamouli On NTR: ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసే సత్తా ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి. ఈయన చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి…ఇక రాజమౌళి 2000 వ సంవత్సరంలో సుడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారాడు.
ఆ సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి కూడా ఇద్దరు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ గా ఉంటూనే మంచి గుర్తింపు ను కూడా సంపాదించుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. అయితే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ లో రాజమౌళికి ఒక విషయం అసలు నచ్చేది కాదట, అదేంటి ఒక హీరో అయి ఉండి కూడా ఏమాత్రం డైట్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా తను నచ్చినవి తింటూ ఉండేవారట…
దాంతో రాజమౌళి ఎన్నిసార్లు చెప్పిన కూడా వినుకుండ అన్ని రకాల ఫుడ్ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు దాంతో ఒకానొక టైం లో ఎన్టీఆర్ ఫుల్లుగా లావైపోయాడు. ఇక రాఖీ సినిమా టైమ్ లో అయితే ఎన్టీఆర్ మరి లావుగా తరయారయ్యడు. ఇక అప్పుడు రాజమౌళి చెప్పిన సలహాతోనే తను సర్జరీ చేయించుకొని యమదొంగ సినిమాతో స్లిమ్ గా తయారయ్యాడు ఇంకా అప్పటినుంచి సినిమా సినిమాకి తన గెటప్ ని మారుస్తూ మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నాడు.
ఇక ముందు నుంచి రాజమౌళి ఎంత చెప్పిన వినకుండా ఫుల్లుగా తినేసి లావై ఆ తరువాత మళ్లీ రాజమౌళి మాట వినాల్సి వచ్చింది. ఇక అదేదో ముందే నేను చెప్పిన మాట ఫాలో అయితే బాగుండేది కదా తారక్ అని రాజమౌళి ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ తో ఫన్నీగా అంటూ ఉంటాడు… మొత్తానికైతే రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అలాగే ఎన్టీఆర్ కూడా స్టార్ హీరోగా ముందుకెళ్తున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక గత ఏడాది త్రిబుల్ ఆర్ సినిమా రావడం మంచి విజయం సాధించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.