SS Rajamouli: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్న దర్శకులలో రాజమౌళి ఒకరు… బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి స్టార్ డైరెక్టర్లు చేస్తున్న సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. అయినప్పటికి ఒక ఇద్దరు దర్శకులు మాత్రం రాజమౌళికి గట్టి పోటీని ఇచ్చే విధంగా సినిమాలైతే రెడీ చేస్తున్నారు… అందులో ఒకరు దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నితీష్ తివారి కాగా, మరొకరు దురంధర్ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించిన ఆదిత్య ధర్ కావడం విశేషం…ఇక ఇప్పటివరకు వీళ్ళు చేస్తున్న సినిమాలన్ని ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. నితీష్ ప్రస్తుతం రబీర్ కపూర్ తో రామాయన్ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. రణ్బీర్ కపూర్ రాముడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో తను ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకోబోతున్నాడు ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే ఆదిత్య ధర్, నితీష్ తివారీ ఇద్దరు కూడా రాజమౌళికి పోటీని ఇవ్వాలనే దృక్పథంతో భారీ బడ్జెట్ తో సినిమాలైతే చేస్తున్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే రాబోయే రోజుల్లో వీళ్లిద్దరు రాజమౌళికి పోటీని ఇస్తూ హైలీ విజువల్ వండర్స్ ను తెరకెక్కిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే రాజమౌళి ని ఢీ కొట్టాలి అంటే బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న దర్శకులు ఎవరు పనిచేయరని వీళ్లిద్దరైతేనే అతడికి తగ్గ పోటీని ఇవ్వగలరని బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం నమ్ముతుంది.
ప్రస్తుతం రాజమౌళి వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఆయనను ఢీకొట్టడం అనేది అంత ఆశామాషీ వ్యవహారం కాదు… డిఫరెంట్ సినిమాలను చేయడం వేరు, రాజమౌళి స్టాండర్డ్స్ లో సినిమాను చేసి భారీ విజయాన్ని సాధించడం వేరు.. సినిమాలను అందరు చేస్తారు కానీ ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా కంటెంట్ రెడీ చేసి సినిమా చేయడం అనేది చాలా కష్టం…
ఆదిత్య ధర్ దురంధర్ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించాడు. అలాగే దంగల్ సినిమాతో నితీష్ తివారి సైతం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తనవైపు తిప్పుకున్నాడు. కానీ ఇదే కన్సిస్టెన్సీ ని ప్రతి సినిమా విషయంలో మెయింటైన్ చేయగలుగుతారా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…