Rajamouli: ‘రాజమౌళి’కి ఉన్న క్లారిటీ అమోహం !

Rajamouli: నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నేటి ఏకైక డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి కెరీర్‌లో విజయం అనేది అత్యంత సహజమైన అంశం అయింది శ్రద్ధగా గోడ కట్టినట్టు సినిమాలు తీసే నైజం రాజమౌళిది. స్క్రిప్ట్ దగ్గర నుంచే రాజమౌళి పర్ఫెక్షన్ మొదలవుతుంది. అలాగే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాడు. తాను తీయబోయే సినిమా ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి అనుభవాన్ని ఇవ్వాలనుకున్నాడో ముందే అర్ధం చేసుకుని.. […]

Written By: Shiva, Updated On : December 26, 2021 11:36 am
Follow us on

Rajamouli: నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నేటి ఏకైక డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి కెరీర్‌లో విజయం అనేది అత్యంత సహజమైన అంశం అయింది శ్రద్ధగా గోడ కట్టినట్టు సినిమాలు తీసే నైజం రాజమౌళిది. స్క్రిప్ట్ దగ్గర నుంచే రాజమౌళి పర్ఫెక్షన్ మొదలవుతుంది. అలాగే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాడు.

Rajamouli

తాను తీయబోయే సినిమా ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి అనుభవాన్ని ఇవ్వాలనుకున్నాడో ముందే అర్ధం చేసుకుని.. ఆ దిశగా తనను, తన టీంని మెరుగు పెట్టుకుంటూ ముందుకు వెళ్లడం జక్కన్నకి ఉన్న అలవాటు. ఇక తన సినిమాల బిజినెస్ స్టామినా విషయంలో కూడా రాజమౌళికి ఉన్న క్లారిటీ అమోహం. సినిమాకి సినిమాకి తన రేంజ్ ను విపరీతంగా పెంచుకుంటూ సాగుతున్నాడు.

నిజానికి రాజమౌళి తనను తాను మార్చుకుంటూ వస్తున్నాడు. తన కెరీర్ మొదటి దశలో సకుటుంబంతో చూడలేని పద్ధతిలో కొన్ని సన్నివేశాలు తీశాడు. యూత్ ను తన సినిమాలకు బాగా అలవాటు చేసుకున్నాక, ఆ తర్వాత సర్వజనామోదం సాధించగలిగే సినిమాల వైపు వెళ్ళాడు. అయితే, బాహుబలి సినిమాతో తెలుగు సినిమా వాణిజ్య స్థాయిని, భారతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళి చూపించాడు.

Also Read: రాజమౌళి స్ట్రాటజీపై అసహనం వ్యక్తం చేస్తున్న మీడియా?

రాజమౌళి జీవితంలోనే ఇది అత్యున్నతమైన విజయం. పైగా తన కెరీర్ మొత్తంలోనే మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ పరాజయం అంటూ ఎరగడు. విజయాల్లో కూడా ఒకదాన్ని కొట్టేవి ఒకటి అన్నట్టే వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. కాకపోతే, ఒకటిన్నర దశాబ్ది కెరీర్‌లో రాజమౌళి కేవలం పన్నెండు సినిమాలే చేశాడు.

కానీ, వంద శాతం విజయాలు, అందులోనూ రెండు మూడు సార్లు తెలుగు సినిమా వాణిజ్య పరిధులను బద్దలుకొట్టే విజయాలను సాధించడం ఎవరూ బద్దలు కొట్టలేని ట్రాక్ రికార్డ్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పై నేషనల్ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 7న ఆ సినిమా రిలీజ్ కాబోతుంది.

Also Read: పవన్​, మహేశ్​లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ జక్కన్న ట్వీట్​

Tags