Mahesh Babu Rajamouli Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీ దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతన్ని టాప్ పొజిషన్లో నిల్చబెట్టాయి. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ పోటీ ఇచ్చే దర్శకులు మరేవరు లేరు అనేది వాస్తవం…బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇప్పటివరకు ఆయన ఎన్ని సినిమాలు చేసిన కూడా పాన్ ఇండియా గుర్తింపు మాత్రం ఆ రెండు సినిమాలతోమీ వచ్చింది. అలాగే ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా అతనికి బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు బాగా హెల్ప్ అయ్యాయనే చెప్పాలి… హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళి సినిమాలను చూసి ప్రశంసించాడు అంటే రాజమౌళి ఏ రేంజ్ లో సినిమాలను తీసి హిట్ కొడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.
మరి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రాజమౌళి అత్యాధునికమైన టెక్నాలజీని వాడుతూ ప్రేక్షకులందరిని అబ్బురపరిచే విజువల్స్ తో కట్టిపడాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నిధి అన్వేషణ కోసం సాగే వ్యక్తిగా కనిపించబోతున్నాడు.
అతనికి రిస్క్ చేయడం అంటే చాలా ఇష్టమట. ఇక దాంతో పాటుగా పలు రిస్కులను చేసి సక్సెస్ ఫుల్ గా నిలిచిన వ్యక్తి కావడంతో అతని చేత కొంతమంది ఒక నిధిని తీసుకురావాలని అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. దాంతో ఆయన అడవిలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న నిధి కోసం బయలుదేరుతాడు. మరి ఆ మధ్యలో ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆ నిధిని కాపాడుకుంటూ ఉండేవాళ్లు అతని మీద ఎలాంటి అటాక్స్ చేశారు. మొత్తానికైతే ఆయన దేవుడిని నమ్ముకొని సక్సెస్ ఫుల్ గా నిధిని తీసుకువచ్చాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ…మరి దాంతో పాటుగా ఆయన ప్రతి విషయానికి దేవుడిని నమ్ముతూ, దేవుడే మనల్ని ముందుకు తీసుకెళుతున్నాడు అంటూ ఒక దైవభక్తి ఆరాధన చేస్తూ ఉంటాడట… మొత్తానికి అయితే ఈ సినిమాలో మహేష్ బాబు శివుడి భక్తుడుగా కనిపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…