Rajamouli Varanasi: మహేష్ బాబు(Super Star Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ పై సోషల్ మీడియా లో ఎలాంటి బజ్ క్రియేట్ అయ్యిందో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. కేవలం టైటిల్ ఈవెంట్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రకంపనలు పుట్టించింది. రాజమౌళి కి ఒక సూపర్ స్టార్ దొరికితే ఎలాంటి అద్భుతాలు క్రియేట్ అవుతాయో, ఒక చిన్న మైక్రో టీజర్ ని చూపించారు. అసలు సినిమా రాబోయే రోజుల్లో ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గానే ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్స్ లో మహేష్ బాబు పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రియాంక చోప్రా తో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ‘వారణాసి’ అనే టైటిల్ పై ఈమధ్య కాలం లో వివాదం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ టైటిల్ ని అంతకు ముందే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించింది. దీంతో ఆ నిర్మాత గొడవ చేయడం తో, ఈ సినిమా టైటిల్ ని మార్చినట్టు తెలుస్తోంది. ‘వారణాసి’ టైటిల్ ని ‘రాజమౌళి వారణాసి’ గా మార్చారు. ఇది కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే, మిగిలిన భాషల్లో ‘వారణాసి’ అనే టైటిల్ ని ఉంచుతారట. అయితే దీనిపై సోషల్ మీడియా లో అనేక ట్రోల్స్ వినిపిస్తున్నాయి. రాజమౌళి చిన్న హీరోలతో సినిమా చేస్తే ఇలాగే తొక్కేస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరోపక్క మహేష్ ఫ్యాన్స్ కూడా ‘రాజమౌళి వారణాసి’ ఏంటి?, మహేష్, రాజమౌళి వారణాసి అని టైటిల్ పెట్టొచ్చు కదా. లేదా హీరో కాబట్టి మహేష్ వారణాసి అని పెట్టొచ్చు కదా అని రాజమౌళి ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.
ఇప్పటి వరకు రాజమౌళి చేసిన ప్రతీ సినిమాకు రాజమౌళి ‘బాహుబలి’, రాజమౌళి ‘#RRR’ అనే పెడుతూ వచ్చారు. ఆయన సినిమాకు ఆయనే మెయిన్ హైలైట్, ఇండియా లో ఎంత పెద్ద సూపర్ స్టార్ తో రాజమౌళి సినిమా చేసినా, అది రాజమౌళి సినిమాగానే చూస్తారు. సూపర్ స్టార్స్ ని మించిన బ్రాండ్ ఇమేజ్ రాజమౌళి సొంతం, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ చిత్రానికి కూడా ‘రాజమౌళి’ వారణాసి అని పెట్టారు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.