Knuckle Cracking: మనం ఒక్కోసారి అనుకోకుండానే చేతివేళ్లను విరుస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది. అలాగే పెద్దవాళ్లు చిన్నపిల్లలను తలపై నిమురుతూ మళ్లీ వారి నెత్తిలో చేతులు పెట్టి మంచడం వల్ల సౌండ్స్ వస్తాయి. ఇలా రావడం వల్ల దిష్టి తీరిపోయింది అని అంటుంటారు. అసలు ఇలా వేలు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది? అసలు వేళ్ళ మధ్య ఏముంటుంది? ఒకసారి వేలు విరిచినప్పుడు శబ్దం వచ్చినప్పుడు.. మళ్లీ వెంటనే విలువగానే సౌండ్ ఎందుకు రాదు? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఈ కిందికి వెళ్ళండి..
మన శరీరా అవయవాల్లో చేతికి ఉన్న వేలు మాత్రమే ఎటూ వీలైతే అటు వంగుతూ ఉంటాయి. అలా వంగడానికి వేళ్ళ మధ్యలో ఒక రకమైన ద్రవపదార్థం ఉంటుంది. ఈ ద్రవపదార్థాన్ని Synovial Fluid అని అంటారు. ఇది వెళ్ళ మధ్యలో పనిచేస్తుంది. ఇది ఉండడం వల్లే వేళ్లపై ఎలాంటి ప్రెజర్ పడకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ లో నైట్రోజన్, కార్బన్డయాక్సైడ్, ఆక్సిజన్ మూడు రకాల పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు అన్నీ కలిపి ఒక గ్యాస్ లాగా తయారవుతుంది. ఈ గ్యాస్ మొత్తం చిన్న చిన్న బుగ్గలు లాగా మారిపోతూ ఉంటాయి. బుగ్గలు లాగా మారిన తర్వాత ఇవి వేల మధ్యలో ఉండిపోతాయి. అయితే మనం అనుకోకుండా లేదా కావాలని వేలు విరిచినప్పుడు ఈ బుగ్గలు లాంటివి పగిలిపోయి సౌండ్ వస్తుంది. సాధారణంగా బయట ఒక బెలూన్ లో గాలి నింపి పగల కొడితే ఎలా సౌండ్ వస్తుందో.. అలాగే ఇక్కడ కూడా వస్తుంది.
అయితే ఒకసారి సౌండ్ వచ్చిన తర్వాత వెంటనే వేళ్లను విరవడం ద్వారా మళ్లీ సౌండ్ రాదు. ఎందుకంటే ఆ బబుల్స్ మళ్లీ తయారు కావడానికి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది. 15 నిమిషాల సమయం తర్వాత మళ్లీ వేళ్లను విరగడం వల్ల సౌండ్ వస్తుంది. అయితే చాలామంది ఈ వేళ్ళు విలువగానే సౌండ్ రావడంతో వేళ్ళు విరిగాయని అనుకుంటూ ఉంటారు. ఈ సౌండ్ రావడానికి లోపల ఇంత సైన్స్ ఉంది అన్నమాట. అయితే ఈ బబుల్స్ ఉండడం వల్ల వీళ్లపై ఎటువంటి ప్రెషర్ పడకుండా వీళ్లను అటు ఇటు తిప్పడానికి వీలు అవుతుంది. అంతేకాకుండా పెద్దపెద్ద బరువులు మోసే సమయంలో కూడా బోన్స్ పై ఎలాంటి బరువు పడకుండా అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి.
ఇక వేళ్ళు విరిచే విధానాన్ని.. లేదా అవసరాన్ని మెదడు వీటికి చేరవేస్తుంది. మెదడు చెప్పిన విధంగానే వీళ్లు అటూ ఇటూ కదులుతూ ఉంటాయి. అంటే ఈ వీళ్లకు సంబంధించిన నరాలు మెదడుతో లింకు అయి ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరి చేతి వేళ్లలో ఇంతటి రహస్యం దాగి ఉంది.