Rajamouli And Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు భారీ గుర్తింపును తెచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే రాజమౌళి (Rajamouli) లాంటి దర్శకుడు చేస్తున్న సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్ గా ప్రూవ్ చూసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు ను సంపాదించుకున్నప్పటికి వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవాలనే ప్రయత్నంతో మహేష్ బాబు(Mahesh Babu) తో చేయబోతున్న సినిమాతో పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. హాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన ‘జేమ్స్ కామెరూన్’ (James Cameroon) పక్కన తన పేరును కూడా నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి రామాయణం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు గా తెలుస్తోంది. రామాయణంలో ఇంద్రజిత్, లక్ష్మణుడు మూర్చపోయి పడిపోయినప్పుడు వాళ్ళను కాపాడడానికి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తారు. చనిపోయిన వాళ్లను బతికించవచ్చు అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండియానా జోన్స్ మూవీ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నామంటూ రాజమౌళి ప్రకటించాడు. అలాగే ఇందులో రామాయణానికి సంబంధించిన కథను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నాడు.
మొత్తానికి అయితే విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) రామాయణాన్ని కలుపుతూ ఈ సినిమా కథను రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే మరో షెడ్యూల్ ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇంతకుముందు రాజమౌళి చేసిన బాహుబలి (Bahubali), ‘త్రిబుల్ ఆర్ ‘ (RRR) సినిమాలు రామాయణం, మహాభారతాలను బేస్ చేసుకొని తెరకెక్కినవే కావడం విశేషం. కాబట్టి రాజమౌళి ప్రతి సినిమాలో కూడా వాటి తాలూకు రిఫరెన్స్ అయితే ఉంటుందని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…