Balakrishna English Dialogue: సినీనటుడుగా.. మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా.. క్యాన్సర్ ఆస్పత్రి నిర్వాహకుడిగా బహుముఖ పాత్రలను పోషిస్తూ నందమూరి బాలకృష్ణ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. నందమూరి బాలకృష్ణకు తెలుగంటే చాలా ఇష్టం. తెలుగులో మాట్లాడటం అంటే చాలా ఇష్టం. తెలుగు ఎంత స్పష్టంగా అయితే మాట్లాడుతాడో.. ఇంగ్లీష్ కూడా అంతే స్పష్టంగా మాట్లాడుతాడు. పైగా ఇంగ్లీషులో ప్రొవెర్బ్స్ ను అద్భుతంగా చెప్పేస్తుంటాడు. అందువల్లే బాలకృష్ణ మాట్లాడే మాటలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవి కట్టు తప్పినప్పటికీ.. బాలకృష్ణ మాట్లాడాడు కాబట్టి అభిమానులు కూడా సరి పెట్టుకుంటారు. పైగా ఎంతటి క్లిష్టమైన, కష్టమైన డైలాగ్ అయినా సరే బాలకృష్ణ గొంతు సవరించుకోకుండా చెప్పేస్తుంటాడు. అనేక సందర్భాలలో బాలకృష్ణ తన వాక్చాతుర్యాన్ని.. తన విషయ పరిజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. తెలుగు నేర్చుకోవడంలోనూ.. తెలుగు చెప్పడంలోనూ.. తెలుగు గురించి వివరించడంలోనూ బాలకృష్ణకు బాలకృష్ణే సాటి. అందువల్లే బాలకృష్ణ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
ఇంగ్లీషులో డైలాగ్ చెప్పి..
బాలకృష్ణ మంగళవారం తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఎప్పటిలాగానే క్యాన్సర్ ఆస్పత్రిలో తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ ముక్కలు పంపిణీ చేశాడు.. ఇక ఆయన అభిమానులు అన్నదానాలు, రక్తదానాలు చేశారు.. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.. నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకకు ఆయన అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఇంగ్లీషులో మాట్లాడారు. సాధారణంగా నందమూరి బాలకృష్ణ తెలుగులోనే అనర్గళంగా మాట్లాడేస్తుంటారు.. కానీ ఇంగ్లీషులో కూడా తాను దిట్ట అని.. ఇంగ్లీషులో కూడా తాను అత్యంత స్పష్టంగా మాట్లాడగలనని నిరూపించారు.. ఎవ్రీ బడీ, సమ్ బడీ, ఎనీ బడీ, నో బడీ అనే పదాలతో గుక్క తిప్పుకోకుండా బాలకృష్ణ మాట్లాడేశారు. ఇంగ్లీష్ జాతీయాలను ప్రముఖంగా ప్రస్తావించి.. బాలకృష్ణ అందరి మనసు దోచుకున్నారు. అంతేకాదు మనిషి నిజ జీవితంలో చేసే తప్పులను.. ఎదుటి వాళ్ళ మీదకు తోసివేసే తీరును బాలకృష్ణ ఉదాహరణలతో చెప్పి ఆకట్టుకున్నారు.
వాస్తవానికి ఆ జాతీయాలను చెప్పాలంటే అంత సులువు కాదు. పైగా ఒక్క పదం కూడా తప్పు పోకుండా చెప్పాలంటే అంత ఈజీ కాదు. అవన్నీ కూడా బాలకృష్ణ చేసి చూపించారు. అంతేకాదు తాను ఇంగ్లీషులో దిట్ట అని నిరూపించుకున్నారు. నిజ జీవితంలో ఇంగ్లీష్ ఎంత అవసరమో.. ఇంగ్లీష్ నుంచి ఎంతవరకు భాషా పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలో.. ఇంగ్లీష్ నుంచి ఎటువంటి జీవిత సారాన్ని గ్రహించాలో బాలకృష్ణ రెండు ముక్కల్లో తేల్చి చెప్పారు. బాలకృష్ణ ఇంగ్లీషులో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను ఆయన అభిమానులు విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. ఇది రా మా బాలయ్య దమ్ము అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంగ్లీష్‌లో డైలాగ్ చెప్పి అదరగొట్టిన బాలయ్య pic.twitter.com/SzPpmgb0CX
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2025