https://oktelugu.com/

Rajamouli And David Warner: తన యాక్టింగ్ తో రాజమౌళి కి పిచ్చెక్కించిన వార్నర్…

ఇంతకు ముందు వార్నర్ ఐపీఎల్ లో "సన్ రైజర్స్ హైదరాబాద్" టీమ్ కి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. దానివల్ల తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరయ్యాడు.

Written By: , Updated On : April 12, 2024 / 05:23 PM IST
Rajamouli And David Warner Hilarious Ad

Rajamouli And David Warner Hilarious Ad

Follow us on

Rajamouli And David Warner: ఆస్ట్రేలియా కి చెందిన “డేవిడ్ వార్నర్” క్రికెటర్ గా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు, ఇక ఈయన కరోనా టైమ్ లో చేసిన షాట్స్, రీల్స్ వల్ల ఇంకా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తెలుగు సినిమా డైలాగులను రీల్స్, షాట్స్ చేస్తూ తనదైన రీతిలో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇంతకు ముందు వార్నర్ ఐపీఎల్ లో “సన్ రైజర్స్ హైదరాబాద్” టీమ్ కి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. దానివల్ల తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరయ్యాడు.

ఇక ఆయన సారథ్యం లో 2016 వ సంవత్సరంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఒకసారి ఐపీఎల్ కప్పును కూడా గెలుచుకుంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు లో ఆయన తీసిన సినిమాల ద్వారా దర్శక ధీరుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి.. ప్రస్తుతం పాన్ ఇండియా ని దాటి పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే cred UPI యాడ్ లో వీళ్ళిద్దరూ కలిసి నటించడం ఇప్పుడు ఒక సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి. అయితే ఈ యాడ్ లో మొదట రాజమౌళి వార్నర్ కి ఫోన్ చేసి నాకు మ్యాచ్ టికెట్లు కావాలి అని అడుగుతాడు.

దానికి వార్నర్ సమాధానం ఇస్తూ టికెట్లు కావాలి అంటే నాకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని చెప్తాడు. దాంతో రాజమౌళి అతనికి సినిమాలో ఛాన్స్ ఇస్తాడు. బాహుబలి, త్రిబుల్ ఆర్ మగధీర గెటప్ లలో నటిస్తాడు. అందులో తన చండాలమైన నటనను చూసిన రాజమౌళి ఇరిటేట్ అవుతాడు. ఇక దాంతో రాజమౌళి నేను అప్డేట్ అవుతున్నాను అందుకే cred UPI కి షిఫ్ట్ అవుతున్నాను అని చెపుతాడు. ఇక ఈ యాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే UPI వాడితే వార్నర్ యాక్టింగ్ లా ఉంటుంది.

అదే cred UPI వాడితే హీరోల యాక్టింగ్ లా ఉంటుందని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం…ఇక ఇది ఇలా ఉంటే ఈ యాడ్ చూసిన నెటిజన్స్ ఫిదా అయిపోయారు. ఇక రాబోయే సినిమాల్లో డేవిడ్ వార్నర్ రాజమౌళి సినిమాలో ఒక్క చిన్న పాత్ర లో అయిన నటించే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Director’s Cut ft. David Warner & SS Rajamouli | CRED