Kartikeya: “రాజావిక్రమార్క” రాకకు ముహూర్తం ఫిక్స్

 Hero Kartikeya : ఈ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్‌ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంచలనాత్మక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. “రాజా విక్రమార్క” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తికేయ డైనమిక్ గా, మ్యాన్లీగా కనిపిస్తున్నాడు.  ఒకవైపు హీరోగా, మరోవైపు విలన్ గా సత్తా చాటుతున్న యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా […]

Written By: Sekhar Katiki, Updated On : October 20, 2021 1:55 pm
Follow us on

 Hero Kartikeya : ఈ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్‌ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంచలనాత్మక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. “రాజా విక్రమార్క” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తికేయ డైనమిక్ గా, మ్యాన్లీగా కనిపిస్తున్నాడు.  ఒకవైపు హీరోగా, మరోవైపు విలన్ గా సత్తా చాటుతున్న యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు.

సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు.

ప్రశాంత్ ఆర్ విహారి దీనికి సంగీతం అందిస్తున్నారు. ఆది రెడ్డి టి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఆ విషయాన్ని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. నవంబర్ 12న “రాజావిక్రమార్క” ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందులో కార్తికేయ విక్రమ్ అనే ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.