https://oktelugu.com/

Samantha: డెహ్రాడూన్​లో స్నేహితులతో చిల్​ అవుతున్న సమంత!

Samantha: ఇటీవలే నాగచైతన్య- సమంత విడాకులు తీసుకున్న విషయం వారి అభిమానులకు షాక్​కు గురి చేసింది. ఈ క్రమంలోనే సమంతపై సోషల్​ మీడియా వేదికగా పలు విమర్శలు గుప్పించారు. మరికొందరు ఆమెకు సమర్ధించారు కూడా. అయితే, తనపై వచ్చిన విమర్శలకు సామ్​ ఎప్పుడూ స్పందించలేదు. ఈ బాధను సమంత ఎలా తట్టుకుంటోంది?. ఆమె  మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా? అనే సందేహాలను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ మెల్లగా చెక్​ పెడుతూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. విజ‌య […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 20, 2021 1:53 pm
    samantha-chilling-out-with-her-bestie-in-dehradun
    Follow us on

    Samantha: ఇటీవలే నాగచైతన్య- సమంత విడాకులు తీసుకున్న విషయం వారి అభిమానులకు షాక్​కు గురి చేసింది. ఈ క్రమంలోనే సమంతపై సోషల్​ మీడియా వేదికగా పలు విమర్శలు గుప్పించారు. మరికొందరు ఆమెకు సమర్ధించారు కూడా. అయితే, తనపై వచ్చిన విమర్శలకు సామ్​ ఎప్పుడూ స్పందించలేదు. ఈ బాధను సమంత ఎలా తట్టుకుంటోంది?. ఆమె  మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా? అనే సందేహాలను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ మెల్లగా చెక్​ పెడుతూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ.

    విజ‌య ద‌శ‌మి రోజున రెండు సినిమాలకు ఒప్పుకున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్​పైకి వెళ్లనున్నాయి. ఓ వైపు ఫిట్‌నెస్​పై శ్రద్ధ పెడుతూనే.. మరోవైపు త‌న స్నేహితుల‌తో క‌లిసి విహారయాత్రలకు వెళ్తోంది. తాజాాగా, సామ్​ త‌న స్నేహితులతో క‌లిసి డెహ్రాడూన్ టూర్ వెళ్లింది. త‌న క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో క‌లిసి ఈ విహారయాత్రలో ఆనందంగా గడుపుతోంది.  ఫ్రెండ్స్‌తో క‌లిసి ట‌గ్ ఆఫ్ వార్ ఆడుతున్న వీడియో, ఫొటోలను సోషల్​ మీడియా వేదికగా షేర్ చేసింది.

    మరోవైపు డెబ్యూడైరెక్టర్స్​తో రెండు సినిమాలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. డ్రీమ్​ వారియర్ పిక్షర్స్​ సంస్థపై ఎస్‌.ఆర్‌. ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ నిర్మిస్తుండగా.. మ‌రో సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు త్వ‌ర‌లోనే స‌మంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

    మరోవైపు నాగచైతన్య కూడా వరుస చిత్రాలతో బీజీగా ఉన్నారు. ఇటీవలే చై నటించిన లవ్​స్టోరీ విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శేఖర్​ కముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.