Raja Saab Vs Mana Shankara Varaprasad Garu: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ‘రాజాసాబ్’ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేశారు. ట్రైలర్ ఓకే అనిపించేలా ఉంది. ప్రభాస్ ఇందులో వైవిధ్య భరితమైన పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. కథ ఇంతకుముందు తెలిసినదే అయినప్పటికి అందులో హార్రర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి విజువల్స్ తో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో మారుతి ఉన్నాడు. ఈ సినిమాను పూర్తి కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సంక్రాంతికి ప్రభాస్ – చిరంజీవి మధ్య విపరీతమైన పోటీ ఉంది. కాబట్టి ప్రభాస్ రాజాసాబ్ సినిమా ట్రైలర్ తో ప్రభాస్ తన సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు పరిచయం చేశాడు. మరి చిరంజీవి సైతం తన సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తే ఈ రెండిట్లో ఏ ట్రైలర్ బాగుంది ఏ సినిమాను మనం ముందు చూడాలి అని ప్రేక్షకులు డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పెద్ద హీరోల సినిమాలు కాబట్టి ప్రతి ప్రేక్షకుడు రెండు సినిమాలను చూస్తాడు. ముఖ్యంగా పాజిటివ్ టాక్ ఏ సినిమాకు వస్తుందో ఆ సినిమాను మొదట చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. తద్వారా ఆ సినిమాకి కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశాలైతే ఉన్నాయి. చిరంజీవి సినిమా కమర్షియల్ హంగులతో ఉండడమే కాకుండా అందులో వెంకటేష్ కూడా ఉన్నాడు.
కాబట్టి ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరక్కుతోంది. మొత్తానికైతే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాని ప్రేక్షకుడి ముందు చూస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది… ఇక అనిల్ రావిపూడి సినిమాలకి పండగ సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అతని సినిమాలను చూసే అవకాశాలైతే ఉన్నాయి.
నిజానికి ఫ్యామిలీ ఆడియన్స్ అతని సినిమాలు చూసిన కూడా యూత్ మాత్రం అనిల్ రావిపూడి సినిమాలను క్రింజ్ కామెడీ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లు ఆ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలైతే లేవు. కాబట్టి అలాంటివారు ప్రభాస్ సినిమాను చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…