Raja Saab vs Mana Shankara Vara Prasad: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వచ్చిన ‘రాజాసాబ్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మెప్పించడం లో విఫలం అయింది. ప్రభాస్ కెరియర్ లో వచ్చిన భారీ డిజాస్టర్ లలో ఈ సినిమా ఈ సినిమా కూడా ఒకటిగా మారబోతుందంటూ ప్రచారమైతే జరుగుతుంది. ఇక చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన మన శంకర్ వరప్రసాద్ సినిమా సైతం ఈరోజు రిలీజ్ అయింది. మొదటి షో తోనే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికి సినిమాలో కొంతవరకు కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే చిరంజీవి వింటేజ్ లుక్ లో మనకు కనిపించారు కాబట్టి రాజాసాబ్ సినిమాతో పోలిస్తే మన శంకర వర ప్రసాద్ కొంతవరకు బెటర్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీ 150 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమా ఈజీగా ఆ కలెక్షన్స్ ని రాబడుతుంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని చేస్తూ ఉంటాడు.
కాబట్టి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఒకటికి రెండుసార్లు ఈ సినిమాని చూసి సూపర్ సక్సెస్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిరంజీవి తో. సినిమా చేయాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది కొంతమంది మాత్రమే నేర్చుకుంటారు. అనిల్ రావిపూడి ఈ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…
ఇక రాజాసాబ్ వర్సెస్ మన శంకర వరప్రసాద్ గా ఈ సినిమాల మధ్య పోటీ నటించింది. ఇక ఇందులో మన శంకర వరప్రసాద్ సినిమా విజయం సాధించిందనే చెప్పాలి… ఇక ప్రభాస్ సైతం రాజాసాబ్ సినిమాతో డీలా పడిపోకుండా వచ్చే సినిమాల విషయంలో కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరిస్తే మంచిది.
మోహమటానికి పోయి ఎవరికి పడితే వాళ్లకు సినిమాలను చేసే ఛాన్స్ లో ఇచ్చేసి తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకోకుండా ఉంటే మంచిదని మేధావులు సైతం అతనికి కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిరంజీవి సైతం మన శంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయింది. కాబట్టి ఇప్పుడు బాబీ తో చేయబోతున్న సినిమా మీద ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…