Venkatesh Cameo in Mana Shankara Varaprasad : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను సక్సెస్ చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకులలో అనిల్ రావిపూడి మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సక్సెస్ లను సాధించడం వల్లే అతనికి మంచి గుర్తింపైతే వచ్చింది. ఇక ఇలాంటి సందర్భంలోనే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు చిరంజీవితో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి డివైడ్ టాక్ వస్తుంది. ఇక ఈ మూవీలో వెంకటేష్ నటించిన విషయం మనకు తెలిసిందే. వెంకటేష్ క్యామియో క్యారెక్టర్ సినిమాకి హెల్ప్ అయిందా? లేదంటే అతని వల్లే ఈ సినిమా గాడి తప్పిందా? అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
వెంకటేష్ ఈ సినిమాలో క్యామియో రోల్ పోషించాడు. అతని క్యారెక్టర్ చాలా హైలెట్ గా నిలుస్తుంది అంటూ దర్శకుడు మొదటి నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడు. నిజానికి వెంకటేష్ క్యారెక్టర్ సినిమాలో చాలా బాగున్నప్పటికి ఆ క్యామియో రూల్ సైతం ప్రేక్షకులను అలరించింది.
అలాగే చిరంజీవి పాటలను వెంకీ డాన్సులు చేయడం, వెంకీ పాటలకు చిరంజీవి డ్యాన్స్ చేయడం లాంటివి కొంతవరకు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించినప్పటికి అది కథకి పెద్దగా హెల్ప్ అయితే అవ్వలేదు. దానివల్ల దర్శకుడు మెయిన్ కథ మీద ఫోకస్ చేయడం మానేసి వాళ్ళిద్దరి క్యారెక్టర్లు ఎలా ఎలివేట్ చేయాలనే దానిమీదనే దృష్టిని మరల్చాడు. అందువల్ల ఈ సినిమాలో అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ను సెట్ చేయలేకపోయాడనే చెప్పాలి… ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి వెంకటేష్ క్యామియో రోల్ హెల్ప్ అయింది.
కానీ సినిమా కంటెంట్ ను చాలా వరకు దెబ్బతీసింది… ఇక ఈ సినిమాలో అనిల్ తన గత సినిమాల్లో వాడినటువంటి కామెడీ పంచులను పెద్దగా ప్రయోగించలేదు. ఏం అనుకున్నాడో తెలియదు గానీ కామెడీ అన్నప్పుడు కామెడీ సన్నివేశాలు ఉండాలి. కామెడీ పంచ్ డైలాగులు కూడా ఉండాలి. కానీ ఈ సినిమాలో వాటిని చాలా వరకు మిస్ చేశాడు…