Raja Saab Teaser Public Review: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(Raja Saab Movie) మూవీ టీజర్ నిన్న విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. లైక్స్ పరంగా ఈ చిత్రం రీసెంట్ గా విడుదలైన అన్ని సినిమాల టీజర్స్ కంటే ది బెస్ట్ గా వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన బాలయ్య(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2) టీజర్ కి 24 గంటల్లో 5 లక్షల 24 వేల లైక్స్ వస్తే, ఏప్రిల్ లో విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ టీజర్ కి 24 గంటల్లో 4 లక్షల 64 వేల లైక్స్ వచ్చాయి. ఇక నిన్న విడుదలైన ప్రభాస్ ‘రాజా సాబ్’ టీజర్ కి 24 గంటల్లో ఏకంగా 5 లక్షల 74 వేల లైక్స్ వచ్చాయి. ఓజీ, దేవర, భీమ్లా నాయక్ టీజర్స్ తర్వాత అత్యధిక లైక్స్ ని సొంతం చేసుకున్న టీజర్ ఇదే. కానీ వ్యూస్ పరంగా మాత్రం రీసెంట్ గా విడుదలైన టీజర్స్ అన్నిటికంటే చాలా తక్కువ.
‘అఖండ 2’ టీజర్ కి 24 గంటల్లో దాదాపుగా 23 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి, అదే విధంగా ‘పెద్ది’ టీజర్ అయితే ఏకంగా 24 గంటల్లో 36 మిల్లియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని సంచలన రికార్డుని నెలకొల్పింది. వాటితో పోలిస్తే ‘రాజా సాబ్’ టీజర్ కి ఎంత తక్కువ రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ‘పెద్ది’, ‘అఖండ 2’ టీజర్స్ కి యాడ్స్ వేశారు, అదే విధంగా ‘రాజా సాబ్’ టీజర్ కి కూడా యాడ్స్ వేశారు. కానీ ‘రాజాసాబ్’ కి వ్యూస్ పరంగా ఎందుకు అంత తక్కువ ఉన్నాయి అనేది మాత్రం అభిమానులకు అంతు చిక్కడం లేదు. నిర్మాతలు కేవలం కొంతవరకు యాడ్స్ ఉంచి, ఆ తర్వాత పూర్తిగా తొలగించారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. బహుశా అదే నిజం కూడా అయ్యుండొచ్చు.
వ్యూస్, లైక్స్ ఎన్ని వచ్చాయి అనేది కాసేపు పక్కన పెడితే ‘రాజా సాబ్’ టీజర్ మాత్రం ట్రేడ్ లో మంచి పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసుకుంది. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని తెచ్చిపెట్టింది. ఈ టీజర్ కి ముందు ఈ చిత్రం సక్సెస్ అవుతుందని అభిమానుల్లో కూడా నమ్మకం ఉండేది కాదు, ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అంచనాలు మొత్తం మారిపోయాయి. ఒకప్పటి ప్రభాస్ ని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా బాగా మిస్ అయ్యారు. ఈ టీజర్ తో వింటేజ్ ప్రభాస్ మరోసారి బయటకి తీశారు అంటూ అభిమానులు మురిసిపోతున్నారు, సినిమా కూడా ఈ రేంజ్ లో ఉంటుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.