Raja Saab Pre-Teaser : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటిస్తున్న ‘రాజా సాబ్'(The Raja Saab) చిత్రానికి సంబంధించిన టీజర్ ని రేపు విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. మేకర్స్ ఈ టీజర్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కేవలం పార్క్ హయాత్ హోటల్ లో వివిధ చానెల్స్ నుండి వచ్చే ప్రెస్ కోసం 70 కి పైగా రూమ్స్ ని బుక్ చేశారట. అనంతరం ‘రాజా సాబ్’ మూవీ షూటింగ్ సెట్స్ ని కూడా చూపిస్తారట. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ ని ప్లే చేయబోతున్నారు. అలా టీజర్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీజర్ విడుదలకు ముందు కాసేపటి క్రితమే ఒక ప్రీ టీజర్ ని విడుదల చేసింది మూవీ టీం. ఈ ప్రీ టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రీ టీజర్ లో అందరూ పైకి చూసి భయపడుతూ ఉంటారు.
It’s more than a vibe…
it’s a REBEL ENERGY ⚡#TheRajaSaabTeaser Tomorrow at 10:52AM. #Prabhas #TheRajaSaab pic.twitter.com/OrB7oZEEI2— The RajaSaab (@rajasaabmovie) June 15, 2025
ఇంతకీ పైన ఏమి ఉంది అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. మొన్న ఈ టీజర్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ టీజర్ లో ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయి. అదే విధంగా ప్రభాస్ మొసలి తో చేసే పోరాటం, ఆ మొసలి చేత అనకొండ పాము పై అటాక్ చేయించడం టీజర్ లో హైలైట్స్ గా నిలిచాయి. ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులకు కూడా ఈ టీజర్ తెగ నచ్చేసింది. మొన్న సోషల్ మీడియా లో లీక్ అయ్యింది రఫ్ కట్ మాత్రమే. రేపు అసలు సిసలు టీజర్ కట్ రాబోతుంది. సాధారణంగా ఈ చిత్రం పై మొదటి నుండి అంచనాలు పెద్ద రేంజ్ లో ఉండేవి కాదు. ఎందుకంటే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ఒక చిన్న కమర్షియల్ డైరెక్టర్ తో సినిమా చేయడం ఏంటి?, అది కూడా ఫామ్ లో లేని చిన్న డైరెక్టర్ తో అంటూ చాలా చిన్న చూపు చూసేవారు.
Also Read: The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’ ఆ చిత్రానికి రీమేకా..? ఆసక్తి రేపుతున్న తలుపుల స్టోరీ!
రేపటి నుండి ఈ చిత్రం పై ఉన్న అంచనాలు మొత్తం మారిపోబోతున్నాయని అంటుంది మూవీ టీం. ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాకు మొదటి నుండి ఎలాంటి అంచనాలు ఉంటాయో ఈ చిత్రం పై కూడా రేపటి నుండి అలాంటి అంచనాలు ఏర్పడుతాయని అంటున్నారు. నార్త్ ఇండియా లో కూడా ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేయడం పక్కా అని అంటున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించారు. హీరోయిన్స్ ఇద్దరి క్యారెక్టర్స్ కూడా ఈ చిత్రం లో చాలా పవర్ ఫుల్ గా ఉంటాయట. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్ తాత గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కనిపించబోతున్నాడట. ఆయన క్యారక్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందట.