Raja Saab Pre Release Business: ‘కల్కి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, కొంత గ్యాప్ తీసుకొని ప్రభాస్(Rebel Star Prabhas) నుండి రాబోతున్న చిత్రం ‘రాజా సాబ్'(RajaSaab Movie). ఇంతటి భారీ గ్యాప్ తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా కాబట్టి, కచ్చితంగా ఈ చిత్రానికి మంచి హైప్ ఉంటుందని అందరూ ఆశిస్తారు. కానీ ఈ సినిమాకు కనీస స్థాయి హైప్ కూడా లేకపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. రెండు పాటలు విడుదల చేశారు, ఒక టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా అవి అలరించలేకపోయాయి, సినిమా మీద హైప్ ని క్రియేట్ చేయడం లో విఫలం అయ్యాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ ఏడాది విడుదలైన ‘గేమ్ చేంజర్’, ‘హరి హర వీరమల్లు’, ‘వార్ 2’ ప్రీమియర్స్ ని కూడా దాటడం కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అక్షరాలా 10 మిలియన్ డాలర్లు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ కేవలం $142K మాత్రమే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 62 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఈ 62 కోట్లలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పాత బకాయిలు కూడా ఉన్నాయట. అవి కలిపి 62 కోట్లు అన్నట్టు సమాచారం. ఇక ఆంధ్ర ప్రాంతం విషయానికి వస్తే 58 నుండి 60 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు సమాచారం. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రానికి 24 కోట్ల రూపాయిల జరిగింది.
ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 146 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందట. ఇక వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి ఈ చిత్రానికి 250 కోట్ల రూపాయిలకు బిజినెస్ జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న హైప్ కి, ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి అసలు ఏ మాత్రం సంబంధం లేదని తెలుస్తోంది. పైగా జనవరి 8 న సాయంత్రం నుండి ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. టాక్ ఏదైనా తేడా కొడితే మొదటి రోజు నుండే వసూళ్లు బాగా తగ్గిపోతాయి. పైగా సంక్రాంతికి ప్రీ ఫెస్టివల్ సమయం లో కలెక్షన్స్ వీక్ గా ఉంటాయి. అలాంటి సమయం లో రాజాసాబ్ ని విడుదల చేయడం, పైగా ఇంత పెద్ద బిజినెస్ టార్గెట్ ఉండడం నిజంగా రిస్క్ అనే చెప్పాలి.