Raja Saab Postponed: ‘కల్కి’ లాంటి సంచలన విజయం తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) చేస్తున్న చిత్రాల్లో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి అతి దగ్గరగా ఉన్న చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Movie). రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని మేకర్స్ విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 5 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 5 న ఈ సినిమా విడుదల అవ్వడం చాలా కష్టమని ఫిలిం నగర్ లో బలంగా వినిపిస్తున్న మాట. అందుకు కారణాలు కూడా ఉన్నాయట. VFX వర్క్ ఈమధ్య ఏ సినిమాకు కూడా ఒక పట్టాన పూర్తి అవ్వడం లేదు. రాజా సాబ్ టీజర్ లో వింటేజ్ ప్రభాస్ ని చూపించినందుకు ఫ్యాన్స్ ఎంతో సంతృప్తి చెందారు, కానీ VFX మీద కంప్లైంట్స్ మాత్రం భారీగానే వచ్చాయి.
ప్రభాస్ రేంజ్ కి తగ్గ VFX వర్క్ అయితే ఇది కాదని, చాలా పేలవంగా ఉన్నాయని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేశారు. మేకర్స్ అభిమానుల ఫీడ్ బ్యాక్ ని తీసుకొని, VFX మీద మరింత శ్రద్ద పెట్టి, క్వాలిటీ పరంగా ఎలాంటి వెనకడుగు వేసేది లేదు అనే ఉద్దేశ్యం తోనే మరోకొంత సమయం తీసుకుంటూ ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చెయ్యకూడదు అనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రభాస్ సినిమా సంక్రాంతికి విడుదలై చాలా ఏళ్ళు అయ్యింది. వర్షం తర్వాత ఆయన నుండి యోగి చిత్రం మాత్రమే సంక్రాంతికి విడుదలైంది. ఇప్పుడు రాజా సాబ్ జనవరి 9 న విడుదల తేదీని ఖరారు చేసుకుంటే ఇది మూడవ ప్రభాస్ సంక్రాంతి సినిమా అవుతుంది. చూడాలి మరి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది.
Also Read: Sakshi Malik Photos: కూల్ వాతావరణంలో హీట్ పెంచుతున్న సాక్షి మాలిక్
ఈ సంక్రాంతికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రాబోతుందని మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఆ దిశగా షూటింగ్ కార్యక్రమాలు కూడా చకచకా జరుగుతున్నాయి. ఇప్పుడు ‘రాజా సాబ్’ జనవరి 9 న ఖరారు అయితే చిరంజీవి, ప్రభాస్ మధ్య బీభత్సమైన పోటీ ని కళ్లారా చూడొచ్చు అన్నమాట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి చిరంజీవి సినిమాకే కాస్త ఎడ్జ్ ఉండొచ్చు. ప్రభాస్ వర్షం సినిమా సమయం లో కూడా మెగాస్టార్ చిరంజీవి ‘అంజి’ సినిమా పోటీ కి వచ్చింది. ఈ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్ళీ అలాంటి ఫలితం రిపీట్ అవుతుందా?,లేకపోతే చిరంజీవి ఈసారి పై చెయ్యి సాధిస్తాడా అనేది చూడాలి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.