Raja Saab Movie Update: ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ప్రభాస్…ఛత్రపతి సినిమాతో మాస్ హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న తను బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో అప్పటినుంచి ఇండియా వైడ్ గా ప్రభాస్ పేరు మారుమ్రోగుతుంది. సలార్, కల్కి లాంటి సినిమాలతో సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు ‘రాజాసాబ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి డైరెక్షన్లో చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ అద్భుతంగా నటించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ కనక మనం చూసినట్లయితే ప్రభాస్ ఇంతవరకు ఎన్నడు చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. ఈ సాంగ్ లో ప్రభాస్ ను చూసిన ప్రతి ఒక్కరికి సాంగ్లో ప్రభాస్ ఫేస్ ఏఐ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమా ప్రభాస్ మొత్తం ఏఐ చేసినట్టుగానే కనిపిస్తే మాత్రం సినిమా మీద నెగెటివ్ కామెంట్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
ఇప్పటివరకు ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడనే ఉద్దేశ్యంతోనే ప్రతి ఒక్కరు సినిమా మీద అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు సినిమాలో ఎక్కువ సన్నివేశాలలో ప్రభాస్ ఒరిజినల్ కాకుండా ఏఐ ద్వారా క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తే మాత్రం ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.
ప్రభాస్ ఈ సినిమాకి ఎక్కువగా డేట్స్ కేటాయించినప్పటికి తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొన్ని సన్నివేశాలను అలా డూప్ తో చేసి సినిమాను కంప్లీట్ చేశారు. దానికి ఏఐ తో ఫైనల్ టచ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఎన్ని సీన్స్ లో కనిపిస్తాడు.
తను కనిపించిన ప్రతిసారి ఒరిజినల్ గా అనిపిస్తాడా?లేదా ఒకవేళ కొన్ని సీన్స్ ఏఐ ద్వారా క్రియేట్ చేసినవి ఉంటే దానికి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇదంతా ఇలా ఉంటే మారుతి మాత్రం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…