Raja Saab: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ప్రభాస్ ఒకరు… ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాకి విపరీతమైన బజ్ క్రియేట్ అవ్వడమే కాకుండా భారీ ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి…తన ఫ్లాప్ సినిమాకి సైతం వందల కోట్ల కలెక్షన్స్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…
Also Read: నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
ప్రభాస్(Prabhas)హీరోగా వచ్చిన ప్రతి సినిమాకి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి ఆదరణ అయితే దక్కుతుంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే మారుతి (Maruthi) డైరెక్షన్లో ఆయన చేస్తున్న రాజాసాబ్ సినిమా ఇప్పటికే స్టార్ట్ అయి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమాను రిలీజ్ చేయలేదు. కారణం ఏదైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో నుంచి రాబోయే సినిమా కాబట్టి దీన్ని తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా డైరెక్టర్లతోనే కావడం విశేషం…ఒక మారుతి మాత్రమే తెలుగు ఇండస్ట్రీకి పరిమితమైన దర్శకుడు…
ఇక రాజాసాబ్ (Rajasaab) సినిమా కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఇలాంటి సినిమాలు చేయడం ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తుంది అంటూ ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు. మరి ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని మీద సరైన క్లారిటీ లేకుండా పోతుంది. ఎప్పటికప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు.
ఇక ఎట్టకేలకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాజాసాబ్ సినిమాని రిలీజ్ చేయకండి ఆ సినిమా కోసం ఎదురు చూసి చూసి మా కండ్లు కాయలు కాసాయి అంటూ సినిమా యూనిట్ మీద అభిమానులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి డిలే ఎక్కడవుతుంది. హీరో ఈ సినిమాకు సంబంధించిన డేట్స్ ని కేటాయించడం లేదా? ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు లేవా? ఎందుకని ఈ సినిమాని డీలే చేస్తున్నారు అంటూ వాళ్ళు తీవ్రమైన కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా అనుకున్న టైమ్ కి రాకపోతే మాత్రం ఈ మూవీ మరింత లేట్ అయితే ఈ సినిమా మీద ఉన్న ఆ కాస్త బజ్ కూడా పోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు. తద్వారా ఈ సినిమాతో దర్శకుడు మారుతి, హీరో ప్రభాస్ ఎలాంటి ఐడెంటిటి ని సంపాదించుకుంటారు అనేది…