Raja Saab Dubai Premiere Talk: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజాసాబ్'(The Rajasaab Movie) కాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అభిమానులు థియేటర్స్ వద్ద బారులు తీసి ఉన్నారు. ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ + మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. రికార్డ్స్ వచ్చేలాగా ఎక్కడా కనిపించడం లేదు కానీ, ఈ జానర్ సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ కి మాత్రమే సాధ్యం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఈ సినిమా తెలంగాణకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు మొదలు అవుతాయో తెలియక అభిమానులు సతమతవుతున్నారు. ప్రభాస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటి తెలంగాణ. ఇక్కడ ఇప్పుడు అసలు రిలీజ్ ఉందా లేదా అనే భయం నెలకొంది అభిమానుల్లో. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో దుబాయి లో ఈరోజు ఉదయం ప్రదర్శించారట.
అక్కడి మీడియా ప్రతినిధులకు ఈ స్పెషల్ షో ని ఏర్పాటు చేశారు. వాళ్ళ నుండి ఈ సినిమాకు వస్తున్న టాక్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే టాక్ ఈరోజు ప్రీమియర్ షోస్ నుండి వస్తే మాత్రం, ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని అంటున్నారు విశ్లేషకులు. ఇక అసలు విషయం లోకి వెళ్తే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా హ్యాండిల్ చేసాడట డైరెక్టర్ మారుతి. ప్రభాస్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని కామెడీ టైమింగ్ ని బయటకు తీసాడట. ముఖ్యంగా దెయ్యానికి ప్రభాస్ భయపడే సన్నివేశాలు చూసే ఆడియన్స్ కి పొట్టచెక్కలు అయ్యేలా చేస్తుందట. కానీ ఎక్కడా కూడా హారర్ థ్రిల్లింగ్ ఫీలింగ్ కలగలేదని, ఎదో ఫస్ట్ హాఫ్ అలా టైం పాస్ అన్నట్టుగా సాగిపోయిందని అంటున్నారు.
ఏ సినిమా కి సెకండ్ హాఫ్ గుండె కాయ లాంటిది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం కచ్చితంగా బాగుండాలి, అప్పుడే సినిమాలు సక్సెస్ అవుతాయి. కానీ ఈ సినిమాకు సెకండ్ హాఫ్ చాలా పెద్ద మైనస్ అని అంటున్నారు. ‘రాజా సాబ్’ క్యారక్టర్ చాలా బాగుంది కానీ, మిగిలిన సన్నివేశాలు ఒక్కటి కూడా అంచనాలకు తగ్గట్టుగా లేదని, గ్రాఫిక్స్ కూడా కొన్ని సన్నివేశాల్లో చాలా పేలవంగా ఉన్నాయని అంటున్నారు. సెకండ్ హాఫ్ ఎక్కువగా ఆడియన్స్ ని చిరాకు పెట్టినప్పటికీ, చివరి 30 నిమిషాలు మాత్రం బాగానే రాసుకున్నాడని, హాస్పిటల్ సన్నివేశం బాగా వచ్చిందని అంటున్నారు. కానీ ఆడియన్స్ కి అది ఏ మాత్రం నచ్చుతుందో చెప్పలేమని కూడా అంటున్నారు. ఓవరాల్ గా మంచి ఫస్ట్ హాఫ్, చెత్త సెకండ్ హాఫ్ అనే టాక్ ఉంది. మరి ఆడియన్స్ నుండి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందా, లేదా వేరేలా వస్తుందా అనేది కాసేపట్లో తెలియనుంది.
Pongal/Sankrathi films pre reports#Parasakthi : Good 1st half, better 2nd half. Overall good #TheRajaSaab : Below par 2nd half. Rajasaab character works , rest not upto mark. Blw avg-avg#MSVG : Entertaining 1st half, 2nd half mid but picks up from Venky entry. Avg-abv avg pic.twitter.com/7r3DUNS4kL
— Front Row (@FrontRowTeam) January 8, 2026