Raja Saab director apologized: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజాసాబ్'(Rajasaab Movie) మూవీ నుండి నిన్న విడుదలైన మొదటి పాటకు ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ వింటేజ్ యాంగిల్ లోకి వచ్చి చేస్తున్న చిత్రం కాబట్టి, ఈ సినిమాలోని పాటలు, ఫైట్స్ మరియు ఇతర ఎలిమెంట్స్ మొత్తం లోకల్ నాటు మాస్ గా ఉంటాయని ఫ్యాన్స్ ముందుగానే ఫిక్స్ అయిపోయారు. కానీ పాట విడుదల అయ్యాక మాత్రం చాలా రొటీన్ గా, పదేళ్ల క్రితం పాటలు ఎలా ఉండేవో, అలా ఉండడం తో అభిమానులు, ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ పాటని హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో అభిమానుల సమక్ష్యం లో గ్రాండ్ గా విడుదల చేశారు. పాట విడుదల కాస్త ఆలస్యం అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ గేట్స్ ని బద్దలు కొట్టేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
అంతే కాకుండా ఈ థియేటర్ లో అభిమానులను ఉద్దేశించి డైరెక్టర్ మారుతీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాలకు దారి తీసింది. ఆయన మాట్లాకడుతూ ‘కొంతమంది లాగా నేను కాలర్ ఎగరవేయను’ అని అంటాడు. గతం లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెండు కాలర్స్ ఎగురవేయడం సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత ఆ సినిమా భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఎన్టీఆర్ పై విపరీతమైన ట్రోల్స్ పడ్డాయి. ఇప్పుడు మారుతీ చేసిన కామెంట్స్ కూడా ఎన్టీఆర్ ని పరోక్షంగా ఉద్దేశించి ట్రోల్ చేసినట్టుగా అనిపించడంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో డైరెక్టర్ మారుతీ ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టడం మొదలు పెట్టారు. దీంతో మారుతి ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్తూ మాట్లాడిన కోఇన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘నిన్న నేను విమల్ థియేటర్ లో మాట్లాడిన మాటలకు ఎన్టీఆర్ అభిమానులు కాస్త బాధ పడ్డారని తెలిసింది. అందుకే నేను ప్రతీ అభిమానికి క్షమాపణలు చెప్తున్నాను. ఎవరినీ కూడా అగౌరవపర్చాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ఎన్టీఆర్ పైన మాత్రమే కాదు, ఆయన అభిమానుల మీద కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. నేను నేను మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని దయచేసి గమనించండి. ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అసలు తగ్గడం లేదు, ఫైర్ మీద ఉన్నారు. అసలే సోషల్ మీడియా లో ప్రభాస్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉన్నాయి. ఇలాంటి సమయం లో మారుతీ కామెంట్స్ మరింత కాక రేపింది.