Raj Tarun-Lavanya : గత ఏడాది ఎక్కడ చూసినా లావణ్య(Lawanya), రాజ్ తరుణ్(Raj Tarun) ప్రేమ వ్యవహారం గురించే చర్చ నడిచేది. అయితే జనాలకు నయాపైసా ఉపయోగం లేని వీళ్ళ వ్యవహారం గురించి ఎందుకు మీడియా ఇంత కవరేజి ఇస్తుంది? అని చివాట్లు పెట్టిన నెటిజెన్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఈ అంశం నుండి అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే, స్త్రీలకు అనుకూలంగా ఉన్న కొన్ని చట్టాలను, లావణ్య లాంటి మహిళలు ఒక మగాడి జీవితాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు, దయచేసి జాగ్రత్తగా ఉండండి అనే సందేశం జనాల్లోకి వెళ్ళింది. ఎందుకంటే లావణ్య గురించి విడుదలైన ఆధారాలు, ఆడియో రికార్డ్స్ ని వింటే కచ్చితంగా ఎవరైనా ఆమెదే తప్పని అనిపిస్తుంది కాబట్టి. జనాల నుండి లావణ్య కి సపోర్టు రాకపోవడం తో ఆమె కూడా ఈ వ్యవహారం పై మాట్లాడడం దాదాపుగా ఆపేసింది. గత ఆరు నెలల నుండి సైలెంట్ ఉన్న లావణ్య రీసెంట్ గానే మస్తాన్ సాయి మ్యాటర్ లో మళ్ళీ బయటకు వచ్చింది.
Also Read : రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య..చుక్కలు చూపిన పోలీసులు!
ఈ క్రమం లో ఆమె రాజ్ తరుణ్ ని ఇబ్బంది పెట్టినందుకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పింది. అంత అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో, మళ్ళీ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మా ఇల్లు మాకు ఇచ్చేయమని లావణ్య ఇంటి ముందుకొచ్చి ధర్నా చేశారు. చివరికి పోలీసుల ఆదేశాలను మన్నించి రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లోపలకు వచ్చేందుకు అనుమతించింది లావణ్య. అయితే దీనిపై ఆమె మళ్ళీ రచ్చ చేయడం మొదలు పెట్టింది. రెండు మూడు రోజుల క్రితం అరియానా, రాజ్ తరుణ్ కలిసి లావణ్య తో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణను మీడియా కి విడుదల చేసిన లావణ్య, కాసేపటి క్రితమే ఒక సంచలన వీడియో ని విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ వీడియో లో రాజ్ తరుణ్, లావణ్య కలిసి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అయితే మా ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అనే అర్థం వచ్చేలా లావణ్య ఈ వీడియో ని విడుదల చేసింది. కానీ వీళ్ళు కచ్చితంగా పెళ్లి చేసుకున్నారు అనేందుకు ఆదారానికి ఇది సరిపోదు. ఎందుకంటే వాళ్ళు లివింగ్ రిలేషన్ షిప్ లో గతంలో ఉండేవారు అనేది నిజమే. ఆ సమయంలో ఇంట్లో ఎదో ఒక పూజ చేసినప్పుడు కూడా వీళ్లిద్దరు ఆశీర్వాదం తీసుకోవచ్చు. అలాంటి వీడియో ని పట్టుకొని మా ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది అని నిరూపించడం కష్టమే. ఇదంతా చూస్తుంటే తనని ఇబ్బంది పెట్టడానికి వచ్చినందుకు లావణ్య రాజ్ తరుణ్ ని నెగెటివ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందని, నీ నాటకాలు ఇక్కడ నమ్మడానికి ఎవ్వరూ లేరు, నీ సమయం వృధా చేసుకొని మా సమయం కూడా వృధా చేయకు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సంచలన వీడియో రిలీజ్ చేసిన లావణ్య
తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్- లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్. లావణ్య సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వద్ద లావణ్య రాజ్ తరుణ్ ఆశీర్వాదం… https://t.co/DKVItXtbb6 pic.twitter.com/XIea7BBeCL
— ChotaNews App (@ChotaNewsApp) April 20, 2025