Rashmi Gautam: బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ చేస్తూ యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది రష్మీ గౌతమ్(Rashmi Gautam). జబర్దస్త్(Jabardasth) అనే కామెడీ షో కి యాంకర్ వ్యవహరిస్తూ ఎంతో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న రష్మీ, ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షో కి యాంకర్ గా వ్యవహరించే అవకాశాన్ని సంపాదించుకుంది. అలా యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మీ కి సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఈమె హీరోయిన్ గా నటించిన ‘గుంటూరు టాకీస్’ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలు ఎవ్వరికీ గుర్తు కూడా లేవు. ఇదంతా పక్కన పెడితే రష్మీ రీసెంట్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఆమె అభిమానులను కలవరపెట్టింది.
Also Read: చదువులో టాపర్.. వరుసగా హిట్స్.. గోల్డెన్ బ్యూటీగా పేరు.. కానీ ప్రస్తుతం అవకాశాలు రాక ఇలా..
ఆమె మాట్లాడుతూ ‘ ఈ ఏడాది జనవరి నుండి నా శరీరం లో ఏమి జరుగుతుందో అర్థం అవ్వని పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా నా శరీరం లోని హెమోగ్లోబిన్ శాతం 9 కి పడిపోయింది. అకాల రక్త స్రావం, తీవ్రమైన భుజం నొప్పి నన్ను ఎంతగానో కృంగదీసింది. వైద్యులను సంప్రదిస్తే ప్రారంభం లో వాళ్లకు దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు. గత నెల 29 నాటికి పూర్తిగా నీరసించిపోయాను. ఇక నా కమిట్మెంట్స్ మొత్తాన్ని పూర్తి చేసుకొని ఈ నెల 18 న హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. డాక్టర్లు సర్జరీ చేశారు. ప్రస్తుతానికి అయితే కోలుకున్నాను. మరో మూడు వారాల పాటు డాక్టర్లు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అది పాటించబోతున్నాను. ఇంత కష్టమైన సమయం లో నాకు అండగా నిలబడిన ప్రతీ ఒక్క అభిమానికి పేరు పేరున కృతజ్ఞతనాలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ రష్మీ.
ఇకపోతే ప్రస్తుతం రష్మీ కి ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. ఈటీవీ లో రష్మీ పేరు చెప్తే మనకి వెంటనే వినిపించే మరో పేరు సుధీర్(Sudigaali Sudheer). వీళ్లిద్దరి కెమిస్ట్రీ బ్లాక్ బస్టర్, అందుకే ఈటీవీ లో వీళ్ళ చుట్టూ కాన్సెప్ట్స్ ని డిజైన్ చేసి భారీ టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకునేవారు. కానీ ఎప్పుడైతే సుధీర్ బుల్లితెర షోస్ కి గుడ్ బాయ్ చెప్పాడో, అప్పటి నుండి ఈమె క్రేజ్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఈమె జబర్దస్త్ షో కి యాంకర్ గా కొనసాగుతుంది. అదే విధంగా ప్రతీ ఆదివారం మధ్యాహ్నం ఈటీవీ లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ రెండు మినహా మరో ప్రోగ్రాం ఆమె చేతుల్లో లేదు. ఇప్పుడు మూడు వారాల పాటు డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు కాబట్టి, ఈమె స్థానంలోకి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కి ఎవరొస్తారో చూడాలి.
Also Read: అర్జున్ S/O వైజయంతి’ 2 రోజుల వసూళ్లు..ఇలా అయితే బ్రేక్ ఈవెన్ అసాధ్యం!