Raj Tarun Ex Lover Lavanya Drunk Driving Accident: రాజ్ తరుణ్(Raj Tarun) మాజీ లవర్ అని చెప్పుకుంటూ మీడియా ముందు లావణ్య సృష్టించిన వీరంగం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనకు రాజ్ తరుణ్ అన్యాయం చేశాడని చెప్పుకొని తిరిగి, అతన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో, అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన లావణ్య(Lavanya) ,చివరికి తప్పు మొత్తం తన వైపే ఉండడం తో , ఇక చేసేది ఏమి లేక, రాజ్ తరుణ్ కి క్షమాపణలు చెప్పింది. అక్కడితో మ్యాటర్ ముగిసిపోయింది అనుకుంటే, కొన్ని నెలల క్రితమే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తమ ఇంటిని తిరిగి ఇచ్చేయాలి అంటూ లావణ్య ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి ఎంత పెద్ద గొడవ చేశారో అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్లిందో ఇంకా ఎవరికీ తెలియదు కానీ, లావణ్య ఇప్పుడు మరో వివాదం లో చిక్కుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ఆమె మధ్య సేవించి కారు లో ప్రయాణిస్తూ సంగారెడ్డి లోని మల్లేపల్లి గ్రామం లో బైక్ తోలుతున్న ఒక వ్యక్తిని గుద్దేసింది. గుద్దిన తర్వాత ఆగకుండా దూసుకొని వెళ్తుండగా గ్రామస్థలు ఆమెని అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలం వద్దకు వచ్చి లావణ్య కి డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు కారుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. లావణ్య తో పాటుగా కారులో మరో వ్యక్తి కూడా ఉండడం గమనార్హం. అయితే ఆమె తాగేసి యాక్సిడెంట్ చేయడమే కాకుండా, ప్రశ్నించిన గ్రామస్తులతో దురుసుగా మాట్లాడడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. దీనిని చూసిన నెటిజెన్స్ సోషల్ మీడియా లో లావణ్య పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇన్ని అవలక్షణాలు ఉన్న అమ్మాయి ని రాజ్ తరుణ్ అన్ని సంవత్సరాలు ఎలా తట్టుకున్నాడో అర్థం కావడం లేదు. నిజంగా అతనికి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా తానూ సినిమాలు చేసుకుంటూ కస్టపడి సంపాదించిన డబ్బులతో కట్టుకున్న ఇంటిని కూడా ఆమెకు వదిలేసాడు, ఇంత మంచి వ్యక్తిని బద్నాం చెయ్యాలని చూసింది లావణ్య అంటూ రాజ్ తరుణ్ పై సానుభూతిని చూపిస్తూ లావణ్య పై మండిపడుతున్నారు నెటిజెన్స్.