సినీనటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఉచ్చు బిగుస్తోంది. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా తనదైన శైలిలో అశ్లీల చిత్రాల వ్యాపారం చేశారని అభియోగం. ముంబై పోలీసులు ఆయనను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజ్ కుంద్రాకు గెహ్నా వశిష్ట్ మద్దతు పలకగా సాగరికా సోనా సుమన్, కంగనా రనౌత్, పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజ్ పాత ట్వీట్లు, ఓ టీవీ షోలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
అశ్లీల చిత్రాలు రూపొందించడం, వీక్షకుల నుంచి సబ్ స్రిప్షన్ ఫీజు వసూలు చేసే మొబైల్ అప్లికేషన్స్ (యాప్స్) లో విడుదల చేయడం దేశంలో అక్రమ వ్యాపారం, అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేసిన యాప్స్ లో ఒకటైన హాట్ షాట్స్ ను డెవలప్ చేసిన ఆర్ట్స్ ప్రైమ్ ప్రై.లి. కంపెనీ రాజ్ కు చెందినదని ఆరోపిస్తున్నారు. వీటిలో విడుదల చేసిన చిత్రాల ద్వారా రాజ్ కుంద్రా, ఆయన తల్లిదండ్రులు లక్షల్లో లాభార్జన గడించారని పేర్కొన్నారు. ఆ చిత్రాలు అప్ లోడ్ చేస్తున్న యాప్స్ కు 20 లక్షల మంది సబ్ స్రైబర్లు ఉన్నారు. నెలకు రూ.60 లక్షల వరకు ఆదాయం వస్తోంది. 2019లో ఆర్క్స్ ప్రైమ్ మీడియా కంపెనీ నుంచి వైదొలిగానని కుంద్రా పేర్కొన్నారు.
రాజ్ కుంద్రా గతంలో చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. పోర్న్ వర్సెస్ ప్రాస్టిట్యూషన్ కెమెరాలో శృంగారం చేస్తున్న వ్యక్తులను చూడడం కోసం డబ్బులు చెల్లించడం ఎందుకు చట్టబద్దం కాదు. రాజకీయ నాయకులు అశ్లీలచిత్రాలు చూస్తున్నారు. అశ్లీల చిత్రాల్లో నటించిన తారలు యాక్టర్లు అవుతున్నారు. ఇంత డబ్బు మీకెక్కడిది? భార్యతో షాపింగ్ కు వెళతారు. ఎప్పుడు చూసిన పార్టీలు అంటారు అని ప్రశ్నిస్తే డబ్బు సంపాదించే టైమ్ ఎక్కడుంది అనే సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.
రాజ్ కుంద్రా న్యాయవాది అని తెలిసిందే. ఆయనపై 2019లో నటి పూనమ్ పాండే కేసు పెట్టారు. రాజ్ కుంద్రా కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ నెల 23 వరకు ఆయన కస్టడీని పోలీసులకు అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. చిత్ర పరిశ్రమ మురికి కాలువ అని ఇందుకే అంటారని తెలుస్తోంది. కనిపించే మెరుపులన్నీ బంగారం కాదు. రాజ్ కుంద్రా వ్యవహారంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అశ్లీల చిత్రాల వ్యాపారంలో పలు కోణాలు దాగి ఉన్నట్లు తెలుస్తోంది.