https://oktelugu.com/

కారెక్కిన కౌశిక్ రెడ్డి.. టికెట్ ఖాయమా? కేసీఆర్ ప్లాన్ ఏంటి?

ఊహకందని ఎత్తులు వేయడంలో సీఎం కేసీఆర్ ను మించిన వారు లేరని రాజకీయవర్గాల్లో చెప్పుకుంటారు. ఇటీవల తెలంగాణ గురుకుల కార్యదర్శిగా రాజీనామా చేసిన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ను హుజూరాబాద్ ఎన్నికల్లో దించబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఈరోజు సీఎం కేసీఆర్ మరో స్టెప్ తీసుకున్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉండి టీఆర్ఎస్ తో అంటకాగిన కౌశిక్ రెడ్డి ‘ఆడియో లీక్’తో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. లీక్ అయిన కౌశిక్ రెడ్డి ఆడియో […]

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2021 / 06:46 PM IST
    Follow us on

    ఊహకందని ఎత్తులు వేయడంలో సీఎం కేసీఆర్ ను మించిన వారు లేరని రాజకీయవర్గాల్లో చెప్పుకుంటారు. ఇటీవల తెలంగాణ గురుకుల కార్యదర్శిగా రాజీనామా చేసిన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ను హుజూరాబాద్ ఎన్నికల్లో దించబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఈరోజు సీఎం కేసీఆర్ మరో స్టెప్ తీసుకున్నారు.

    హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉండి టీఆర్ఎస్ తో అంటకాగిన కౌశిక్ రెడ్డి ‘ఆడియో లీక్’తో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. లీక్ అయిన కౌశిక్ రెడ్డి ఆడియో ఆయన ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసేసింది. దీంతో కేసీఆర్ ఈయనను అసలు టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటారా? టీఆర్ఎస్ టికెట్ ఇస్తారా? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ కేసీఆర్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

    సాధారణంగా యువ నేతలు, కొత్తవారిని కేసీఆర్ ఆహ్వానించరు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కండువా కప్పిస్తారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అక్కడి కీలక నేత అయిన కౌశిక్ రెడ్డి విషయంలో తనే స్వయంగా కదిలివచ్చారు.

    తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వివాదాస్పదుడు అయిన కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించడం విశేషంగా మారింది. అసలు ఆయనకు చోటు ఇవ్వరనుకుంటున్న వేళ కౌశిక్ రెడ్డికి స్వయంగా కండువాకప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

    కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంతా గులాబీ జెండాలతో కౌశిక్ రెడ్డి నింపేశాడు.తన అనుచరులు, అభిమానులను భారీగా తీసుకొచ్చి కోలాహలంగా టీఆర్ఎస్ లో చేరారు.

    కౌశిక్ రెడ్డిని చేర్చుకున్న అనంతరం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు ‘కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయనకు చిన్న పదవి ఇచ్చి సరిపెట్టను. కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డితో తాను కలిసి పనిచేశానని ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని ’ కేసీఆర్ హామీ ఇచ్చారు.

    కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా హుజూరాబాద్ పార్టీ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డినే కనిపిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే హుజూరాబాద్లో రెడ్డి సామాజికవర్గం శాసించే స్థితిలో బలంగా ఉంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇస్తే వారంతా దూరం కావడంఖాయం. అందుకే ప్రవీణ్ కంటే కౌశిక్ రెడ్డివైపే కేసీఆర్ మొగ్గు చూపారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

    పైగా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు గట్టి పోటీనిచ్చి ఓడించినంత పనిచేశాడు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ తరుఫున నిలబడి రెండో స్థానంలో నిలిచాడు. ఇక వరుసగా ఈటల చేతిలో ఓడిపోయిన చరిత్ర కౌశిక్ రెడ్డి. అందుకే ఈసారి ఆ సానుభూతి పనిచేసి కౌశిక్ రెడ్డి గెలుస్తాడని భావించి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి స్వయంగా కండువా కప్పినట్టు తెలుస్తోంది.

    మొత్తంగా చూస్తే చివరి వరకు గుంభనంగా వ్యవహరించే కేసీఆర్ ఎత్తులు వేసిన తర్వాతే వ్యూహాత్మకంగా కౌశిక్ రెడ్డి ని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి హుజూరాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డికేనన్న చర్చ సాగుతోంది.