Allu Arjun: పుష్ప హిందీలో క్లీన్ హిట్ గా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 83 చిత్రం నుండి తీవ్ర పోటీ ఎదుర్కొన్న పుష్ప రికార్డు వసూళ్లు రాబట్టింది. ఒక విధంగా చెప్పాలంటే లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ 83 వసూళ్లకు పుష్ప గండి కొట్టింది. బి,సి సెంటర్స్ లో పుష్ప 83 మూవీ కంటే మెరుగైన వసూళ్లు రాబట్టింది. పుష్ప హిందీ వర్షన్ రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించినట్లే అంటున్నారు.
ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుండి హిందీ బెల్టులో అంత క్రేజ్ ఉన్న హీరోగా అల్లు అర్జున్ అవతరించాడని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ రీత్యా… అల వైకుంఠపురంలో చిత్ర హిందీ వర్షన్ అక్కడ విడుదల చేయనున్నారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: శ్రీదేవి తర్వాత ఆ ఫీట్ అందుకున్న హీరోయిన్స్ వీరే !
అయితే మెగా ఫ్యామిలీ నుండి టాప్ హీరోగా అల్లు అర్జున్ అవతరించాడని రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇకపై అల్లు అర్జున్ మెగా హీరో కాదని, మెగా హీరోలు అల్లు అర్జున్ పేరుతో తమని తాము పరిచయం చేసుకోవాలి అంటున్నాడు. దశాబ్దాలుగా కొణిదెల, అల్లు కుటుంబాలలోని హీరోలు ఎవరైనా చిరంజీవి పేరు చెప్పుకుంటారు. చిరు కొడుకుగా, తమ్ముడుగా, మేనల్లుడిగా గుర్తింపు పొందారు.
Also Read: రోహిత్ రంగంలోకి.. కోహ్లీకి అసలే చోటే ఉండదట?
చిరంజీవి తర్వాత అంతటి ఫేమ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గుర్తింపు కూడా చిరు తమ్ముడిగానే ఉంది. ఇకపై ఈ గుర్తింపు, బ్రాండ్ నేమ్ మారిపోనుందట. బాలీవుడ్ లో మెగా హీరోలు తమను పరిచయం చేసుకోవాలంటే అల్లు అర్జున్ ద్వారా పరిచయం చేసుకోవాలట. పరోక్షంగా చిరంజీవికి మించిన స్టార్ డమ్, పాపులారిటీ అల్లు అర్జున్ సొంతమని వర్మ అభిప్రాయం. బాలీవుడ్ లో అల్లు అర్జున్ ఫేమ్ ఊహించని స్థాయి చేరగా… చిరంజీవి సైతం తనను అల్లు అర్జున్ మేనమామగా పరిచయం చేసుకోవాలట.
పుష్ప విడుదలకు ముందు కూడా రామ్ గోపాల్ వర్మ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మెగా హీరోలలో నిజమైన సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే, తను ఎవరి సప్పోర్ట్ లేకుండా ఎదిగాడంటూ వరుస ట్వీట్స్ తో మెగా ఫ్యాన్స్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే వర్మ ట్వీట్స్ గురించి, మెగా ఫ్యామిలీ ని ఆయన టార్గెట్ చేసే తీరు గురించి తెలిసిన ఫ్యాన్స్… సదరు ట్వీట్స్ పై పెద్దగా స్పందించలేదు.
Also Read: ఫిబ్రవరిలో కూడా వాయిదాల వడ్డింపేనా!… పవన్, రవితేజ, సూర్య రావడం కష్టమే?