ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టేసి ఆ ఫుటేజ్ తో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారన్నది ఇట్టే తెలుసుకోవచ్చు. ఆఫీస్ అయినా ఇళ్లు అయినా సీసీ కెమెరాలతో ఏం జరుగుతుందో మనం ఎక్కడున్నా తెలుసుకోవచ్చు. మొబైల్ ను ఆ డివైజ్ తో కనెక్ట్ చేసుకుంటే చాలు.. అంతా లైవ్ లోనే చూసేయవచ్చు.
ఇలాంటి డిఫెరెంట్ కథాంశంతో తెరకెక్కిన మూవీ ‘నెట్’. కమెడియన్ రాహుల్ రామకృష్ణ, హీరోయిన్ అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ‘సస్పెన్స్’ కథాంశంతో తెరకెక్కిన ఈ టీజర్ ఉత్కంఠ బరితంగా ఉంది.
లక్ష్మణ్ అనే పాత్రలో నటించిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ సీసీ ఫుటేజ్ ల ద్వారా ఆఫీసులు, ఇళ్లలో వాళ్లు చేసుకుంటున్న శృంగారాన్ని మొబైల్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. హీరోయిన్ అవికా గోర్ అశ్లీల చిత్రాలు కూడా చూసేందుకు ప్రయత్నించాడు.
అలా సీసీ కెమెరాలతో అశ్లీల చిత్రాలు చూసే రాహుల్ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. హీరోయిన్ ప్రైవేట్ లైఫ్ ను వీక్షించిన రాహుల్ చిక్కుల్లో ఎలా పడ్డాడో అన్నది ఆసక్తికరంగా చూపించారు.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠబరితంగా తీర్చిదిద్దారు. రోమాన్స్ , సస్పెన్స్ కలిగలిపి ఉన్న ట్రైలర్ ను కింద చూడొచ్చు.