Prabhas fans reaction to Dragon movie: ఒక స్టార్ హీరో కి సంబంధించిన టీజర్ , ఫస్ట్ లుక్ , ట్రైలర్, గ్లింప్స్ వీడియో వచ్చిందంటే , సోషల్ మీడియా లో హంగామా మామూలు రేంజ్ లో ఉండదు. ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడుకుంటారు. పొగిడేవాళ్లు పొగుడుతారు , తిట్టేవాళ్ళు తిడుతారు , ఇవన్నీ చాలా సర్వ సాధారణం. మొన్న రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైనప్పుడు ఇదే జరిగింది, నిన్న రాత్రి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ విడుదలైనప్పుడు కూడా అదే జరిగింది. ముఖ్యంగా ‘డ్రాగన్’ గ్లింప్స్ ని చూసి ఆశ్చర్యపోతూ , ఇదేమి టేకింగ్ రా బాబోయ్ , ప్రశాంత్ నీల్ ని మించిన యాక్షన్ డైరెక్టర్ ఇండియా లోనే లేదంటూ సోషల్ మీడియా లో ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క ఎన్టీఆర్ ఈ సినిమాకు అసలు సూట్ అవ్వలేదని, ప్రభాస్ ‘సలార్’ లుక్ ని కాపీ కొట్టినట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ కి తిరుగులేని స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం వల్ల, ‘సలార్’ గ్లింప్స్ సంచలనం సృష్టించిందని , ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అసలు బాగాలేదని , బంగారం లాంటి గ్లింప్స్ కి ఎన్టీఆర్ చాలా పెద్ద మైనస్ అయ్యాడని సోషల్ మీడియా లో అత్యధిక శాతం మంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ లో ఉన్నారు. తమ అభిమాన హీరో ని ఎలా అయితే చూడాలని అనుకున్నారో , అలా ప్రశాంత్ నీల్ చూపించాడని , ఎన్టీఆర్ లుక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని , ఎన్టీఆర్ ఏది చేసిన ట్రోల్ చేయడానికి ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంటుందని , వాళ్లకు గ్లింప్స్ ఎంత బాగున్నా నచ్చదని విశ్లేషకులు చెప్పే మాట. అయితే ఇదే సినిమాలో ప్రభాస్ నటించి ఉండుంటే ఎలా ఉండేది?.
ఒకసారి ఊహించుకోండి , ప్రభాస్ లాంటి డైనోసార్ కటౌట్ లూగర్ , డ్రాగన్ పాత్రలు పోషించడం, ఇద్దరి ప్రభాస్ లు వెండితెర మీద నువ్వా , నేనా అనే రేంజ్ లో కొట్లాడుకుంటే చూసే ఆడియన్స్ కి ఎలాంటి థియేట్రికల్ అనుభూతి వస్తుంది అనేది? అని అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పైగా ప్రభాస్ మార్కెట్ వేరే లెవెల్ లో ఉంటుంది కాబట్టి , ఇలాంటి కాన్సెప్ట్ తో ఆయన సినిమా చేస్తే వెయ్యి కోట్ల గ్రాస్ ని మొదటి వారం లోనే కొడుతాను , ఎన్టీఆర్ కి 500 నుండి 600 కోట్లకు మించి రావని , ఇలా ఎన్నో రకాల పోస్టులు వేస్తున్నారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేయడం ఎన్టీఆర్ కి కొత్తేమి కాదు , ముఖ్యంగా తనని తక్కువ అంచనా వేసిన వారికి చుక్కలు చూపియ్యడం లో ముందు ఉంటాడు, కాబట్టి జూన్ 11 , 2027 లో ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ సృష్టించే విద్వంసం గురించి మాట్లాడుకుంటుంది అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్టున్నారు.
