Homeఎంటర్టైన్మెంట్Ragini MMS 3 Tamanna Bhatia: అమీర్ ఖాన్ కుమారుడితో తమన్నా బోల్డ్ రొమాన్స్..మండిపడుతున్న నెటిజెన్స్!

Ragini MMS 3 Tamanna Bhatia: అమీర్ ఖాన్ కుమారుడితో తమన్నా బోల్డ్ రొమాన్స్..మండిపడుతున్న నెటిజెన్స్!

Ragini MMS 3 Tamanna Bhatia: సౌత్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి, ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని, స్టార్ హీరోయిన్ గా గత రెండు దశాబ్దాల నుండి కొనసాగుతున్న తమన్నా(Tamanna Bhatia), ఇప్పుడు తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ వైపే పెట్టింది. అందం తో పాటు, అద్భుతమైన నటన, డ్యాన్స్ టాలెంట్ తమన్నా సొంతం. ఇలాంటి టాలెంట్ ప్యాకేజ్ తో ఒక హీరోయిన్ దొరకడం చాలా అరుదు. అందుకే తమన్నా ఎంతమంది కుర్ర హీరోయిన్లు వచ్చినా పోటీ ని తట్టుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే తమన్నా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఎంత ఇబ్బంది పడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సౌత్ సినిమాలు చేస్తున్నంత కాలం ముద్దు సన్నివేశాల్లో నటించడానికి అసలు ఇష్టం చూపేది కాదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా అలాంటి సందర్భం వచ్చినప్పుడు ‘నో’ చెప్పేది.

డైరెక్టర్ సన్నివేశం డిమాండ్ చేస్తుంది, కచ్చితంగా రొమాన్స్ చెయ్యాల్సిందే అని పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి చేయమంటే బలవంతంగా చేయాల్సిందే కానీ, సాధారణమైనంత వరకు ఇలాంటి సన్నివేశాలకు దూరం గా ఉండడానికే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే ఈమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టిందో, తాను ఏర్పాటు చేసుకున్న రూల్స్ అన్నిటిని చెరిపేసింది. ఇప్పుడు అక్కడ ఆమె ఘాటు రొమాన్స్ ఉన్న సినిమాలు తప్ప మరొకటి చేయడం లేదు. డైలాగ్స్ కూడా చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. ఇలా మారిపోయారేంటి అని ఇంటర్వ్యూస్ లో అడిగినప్పుడు, ఇప్పటి యూత్ అలాంటివే కోరుకుంటున్నారు, కాబట్టి వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా మారాను అంటూ సమాధానం ఇచ్చింది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె బాలీవుడ్ లో ‘రాగిణి MMS 3’ అనే రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ చిత్రం లో నటించడానికి సిద్ధమైపోయింది. గత రెండు సినిమాల్లో సన్నీ లియోన్ లాంటి వాళ్ళు ఈ చిత్రం లో నటించారు.

దీనిని బట్టీ ఈ చిత్రం ఎంతటి బోల్డ్ రొమాన్స్ తో నిండిపోయి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే, ‘రాగిణి MMS 3’ లో తమన్నా కి జోడిగా నటించబోతున్నది మరెవరో కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ అట. ఇతని వయస్సు ప్రస్తుతానికి 32 ఏళ్ళు, తమన్నా వయస్సు 36 వరకు ఉంటుంది. నీకంటే నాలుగేళ్లు చిన్నవాడైన జునైద్ ఖాన్ తో, ఇలాంటి బోల్డ్ రొమాన్స్ ఉన్న సినిమాలో అతనితో రొమాన్స్ చేయడానికి ఎలా ఒప్పుకున్నావు అంటూ సోషల్ మీడియా లో తమన్నా అభిమానులు గట్టిగా నిలదీసి ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే, ఎలా ఉండే తమన్నా ఎలా అయిపోయింది, అడల్ట్ కంటెంట్ సినిమాలు తప్ప, ఆమె ఈమధ్య కాలంలో వేరే సినిమాని ఒప్పుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular