Chiranjeevi-Raghu Kunche: సినిమాల మీద ఆసక్తితో డిగ్రీ మధ్యలోని వదిలేసి తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్ వచ్చేశారు మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే. అయితే ఆయనకు రావడంతోనే ఏమీ అవకాశాలు దక్కలేదు. అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న పూరి జగన్నాథ్ తో స్నేహం ఏర్పడింది. దీంతో వారిద్దరూ కలిసి ఒకే రూమ్‌లో ఉండేవారు. ఒకరోజు రఘు రూమ్‌లో పాడిన పాట విన్న పూరి.. తన మొదటి సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడంట.

ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ తో బద్రి సినిమా రూపంలో మొదటి ప్రాజెక్ట్ పూరి జగన్నాథ్‌కు వచ్చింది. ఇంకేముంది తనలోని కసిని మొత్తం తీసేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే ఈ మూవీలో రఘుకు పాడే ఛాన్స్ ఇవ్వలేకపోయాడు పూరి. కాకపోతే తన రెండో సినిమాతో జగపతి బాబుతో చేసిన బాచి మూవీలో మాత్రం లక్ష్మీ అనే పాట పాడే ఛాన్స్ ఇచ్చాడు.

Also Read: ఈవీవీ లైఫ్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ బడ్జెట్ కేవలం రూ.50 లక్షలు… వచ్చింది 2 కోట్లు.. ఏదో తెలుసా?
దీన్ని అద్భుతంగా పాడాడు రఘు. అప్పటికే మెగాస్టార్ గా నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న చిరంజీవి.. మృగరాజు మూవీ డబ్బింగ్ కోసం స్టూడియోకు వెళ్లగా.. అక్కడ రఘు తన అభిమాను హీరో అయిన చిరంజీవిని చూసి మురిసిపోయాడంట. ఇక చిరుకు తను పాడిన లక్ష్మీ పాటను వినమని ఓ సీడీని ఇచ్చాడంట. ఇక దాన్ని చిరు కారులో వెళ్తుండగా విని రఘుకు ఫోన్ చేశాడంట.
పాట చాలా బాగుందని, ఇంత బాగా పాడుతావని అనుకోలేదంటూ మెచ్చుకున్నాడంట. అంతే కాకుండా మృగరాజు మూవీలో ఓ పాట పాడే ఛాన్స్ కూడా ఇచ్చాడంట చిరు. దీంతో తను ఎంతో అభిమానించే మెగాస్టార్ మెచ్చుకోవడంతో ఎంతో సంతోషించాడంట రఘు. ఆ ఆనందంలో ఆ రోజు మొత్తం అన్నం తినకుండా చిరు చెప్పిన మాటలను బంధువులు, స్నేహితులతో చెప్పుకుంటూ ఆనందించాడంట. ఇల ఆరోజు రూమ్‌లోనే కండ్ల వెంబడి నీళ్లు తెచ్చుకుంటూ ఉండిపోయాడంట.
Also Read: రాజమౌళి, కీరవాణి పేర్ల ముందు ఎమ్ఎమ్, ఎస్ఎస్ ఉండటానికి కారణం ఇదే..!

[…] […]