https://oktelugu.com/

లెజెండరీ దర్శకుడి కోడలకి మళ్ళీ పెళ్లి !

టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు కె.రాఘ‌వేంద్ర‌రావు కోడ‌లు ‘క‌నికా థిల్లాస్’ మళ్ళీ పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ ర‌చ‌యిత హిమాన్షు శ‌ర్మ‌తో కొంత కాలంగా ప్రేమాయ‌ణం సాగిస్తూ వస్తోన్న ‘క‌నికా థిల్లాస్’ మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. మరి ఈ ఇన్నింగ్స్ లోనైనా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందో.. లేక మధ్యలోనే డ్రాఫ్ అవుతుందో చూడాలి. ఇక తన రెండో పెళ్లి సంబంధించిన ఫొటోల‌ను క‌నికా త‌న సోష‌ల్ మీడియా గ్రూప్‌లో షేర్ చేస్తూ.. ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర […]

Written By:
  • admin
  • , Updated On : January 5, 2021 / 01:21 PM IST
    Follow us on


    టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు కె.రాఘ‌వేంద్ర‌రావు కోడ‌లు ‘క‌నికా థిల్లాస్’ మళ్ళీ పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ ర‌చ‌యిత హిమాన్షు శ‌ర్మ‌తో కొంత కాలంగా ప్రేమాయ‌ణం సాగిస్తూ వస్తోన్న ‘క‌నికా థిల్లాస్’ మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. మరి ఈ ఇన్నింగ్స్ లోనైనా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందో.. లేక మధ్యలోనే డ్రాఫ్ అవుతుందో చూడాలి. ఇక తన రెండో పెళ్లి సంబంధించిన ఫొటోల‌ను క‌నికా త‌న సోష‌ల్ మీడియా గ్రూప్‌లో షేర్ చేస్తూ.. ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర కామెంట్ కూడా పెట్టింది.

    Also Read: ఎన్టీఆర్ ముందు మహేష్ నిలబడగలడా..?

    ఇంతకీ ఆ కామెంట్ ఏంటంటే.. ‘కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ప్ర‌యాణం’ అని త‌న పెళ్లికి సంబంధించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ పోస్ట్ చేసింది. అయితే, నెటిజన్లు మాత్రం కొత్త ప్ర‌యాణం ఏముంది, పాత ప్రయాణమేలే అంటూ కనికాకి కౌంటర్లు వేస్తున్నారు. అయితే కనికా ఈ సారి పెళ్లి చేసుకుంది ఓ రచయితనే. మొత్తానికి ఇద్ద‌రూ సినీ ర‌చ‌యిత‌లు ఒక్కటి కావ‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. హ్యాపీగా ఇక నుండి ఇద్దరూ కలిసి కథలు రాసుకోవచ్చు. ఇక తన మొదటి భర్త ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాశ్ కోవెల‌మూడిని మొదటి పెళ్లి చేసుకున్న కనికా.. అతనితో మ‌నస్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయింది.

    Also Read: సీనియర్ ఎన్టీఆర్ – మెగాస్టార్’ వాయిస్ ఓవర్ తో ‘తారక్ – చరణ్’ టీజర్ !

    కాగా తన మొదటి భర్తతో వైవాహిక జీవితంలో నుండి విడిపోయినా… సినిమా లైఫ్‌లో మాత్రం ఇద్దరూ కలిసే ఉన్నారు. కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ ‘జ‌డ్జిమెంట‌ల్ హై క్యా’ చిత్రానికి ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా.. ఆ సినిమాకి క‌నికా క‌థ‌ను అందించింది. పైగా ఆమె తన రెండో భర్తతో రాస్తున్న కొత్త కథను కూడా.. తన మొదటి భర్తకే ఇస్తోందట. మొత్తానికి కనికాది పెద్ద హృదయమే. క‌నికా థిల్లాస్‌, హిమాన్షు శ‌ర్మ వివాహం చాలా నిరాడంబ‌రంగా జ‌రిగింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్