Raghavendra Rao Latest Controversy: టాలీవుడ్ లో పీక్ కమర్షియల్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే , చిన్న పిల్లవాడు కూడా చెప్పే పేరు రాఘవేంద్ర రావు. ఎన్టీఆర్ కాలం నాటి సూపర్ స్టార్స్ నుండి , నేటి తరం సూపర్ స్టార్స్ వరకు , ప్రతీ ఒక్కరితో పని చేసి , తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ని అందించిన చరిత్ర ఆయనది. నేటి తరం లో మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వపడే రాజమౌళి, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారిని పరిచయం చేసిన ఘనత ఆయనది. అలాంటి లెజెండ్ ఈమధ్య కాలంలో తరుచూ నెటిజెన్స్ నుండి తీవ్రమైన విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. అందుకు కారణం ఆయన యంగ్ హీరోయిన్స్ తో ప్రవర్తించే తీరు అని అంటున్నారు. కొన్ని రోజుల క్రితమే నిహారిక కొణిదెల పై ఆయన చెయ్యి వేసిన తీరుపై తీవ్రమైన విమర్శలు చేసారు నెటిజెన్స్. ఆ వీడియో సోషల్ మీడియా లో పెద్ద వివాదాస్పదంగా మారింది.
ఇప్పుడు లేటెస్ట్ గా మరో వీడియో రాఘవేంద్ర రావు పై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు అనిల్ రావిపూడి – విక్టరీ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాఘవేంద్ర రావు ఒక అతిథి గా విచ్చేశాడు. అయితే ఆయన ఈ ఈవెంట్ లో హీరోయిన్ కీర్తి సురేష్ , కృతి శెట్టి లపై చేతులు వేయడాన్ని నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆయన కీర్తి సురేష్ భుజం పై చేతులు వేసి , స్టైల్ గా ఫోటో దిగడం నెటిజెన్స్ కి అసలు నచ్చలేదు. ఆడవాళ్ళ పై చేతులు వేయకుండా ఉండలేవా?, ఈ వయస్సులో ఇవేమి పనులు అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
మీకు కూడా రాఘవేంద్ర రావు ఈ వయస్సులో ఇలా హీరోయిన్స్ తో వ్యవహరించడం తప్పు అనిపించిందా అనేది కామెంట్స్ రూపం లో తెలియజేయండి. అయితే రాఘవేంద్ర రావు వయస్సులో పెద్ద మనిషి కాబట్టి , కూతురి తో సమానంగా భావించి హీరోయిన్స్ పైన చెయ్యి వేసి ఉండొచ్చు కదా?, ఎందుకు ప్రతీ విషయాన్ని చెడు ఆలోచనలతో చూస్తారు? అంటూ రాఘవేంద్ర రావు ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా లాజిక్ కదా అది?, గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ అనేది ఆడవాళ్లకు తెలిసిపోతుంది. బ్యాడ్ టచ్ అనిపించినప్పుడు ఆడవాళ్ళూ అసౌకర్యంగా ఫీల్ అవుతారు , నేడు వైరల్ అవుతున్న వీడియోలో హీరోయిన్స్ అసౌకర్యం గా ఫీల్ అయ్యినట్టు ఎక్కడ అనిపించడం లేదా?, మీకేమైనా అనిపించిందా?, కామెంట్ చేయండి.
endi ra ee musalodu, pratisari touch cheyanike chustaduu pic.twitter.com/1Kq2WugdPi
— Sanjana (@SanjanasX) June 18, 2026
