Raghava Lawrence TVK Party MLA Candidate: తమిళనాడు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తన మార్కు పాలనతో ఒక పక్క అభిమానులను గర్వపడేలా చేస్తూ , మరోపక్క జనరంజకమైన పాలనతో , ప్రతీ అడుగు నిజాయితీగా వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు ఇండియా లో ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయి నిర్ణయాలు , ఆలోచనలు చేయడం లేదు. ఈ విషయం లో విజయ్ ని కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. జనాలు తనకు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ , అడుగడుగునా తన మార్క్ చూపిస్తున్నాడు విజయ్. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా విజయ్ ఈ ఎన్నికల్లో తిరుచ్చి, పెరంబూరు స్థానాల్లో పోటీ చేసి , రెండిట్లోనూ బంపర్ మెజారిటీ తో గెలిచిన సంగతి మన అందరికీ తెలిసిందే.
అయితే రాజ్యాంగం ప్రకారం , కచ్చితంగా ఆరు నెలల్లో ఎదో ఒక స్థానం నుండి రాజీనామా చెయ్యాలి , ఆ స్థానం లో తన పార్టీ తరుపున అభ్యర్థిని నిలబెట్టి పోటీ చేయించాలి. విజయ్ ఏ స్థానాన్ని వదులుకుంటాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూశారు . ఆయన తిరుచ్చి స్థానానికి రాజీనామా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు కూడా . అయితే ఈ స్థానం నుండి ప్రస్తుతం సహజీవనం చేస్తున్న హీరోయిన్ త్రిష పోటీ చేస్తుందని , త్వరలోనే ఆమె తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగడం లేదు, త్రిష కి అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని తెలుస్తోంది. కానీ ఈ స్థానం నుండి టీవీకే పార్టీ అభ్యర్థిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ , దర్శకులు కమ్ నటుడు రాఘవ లారెన్స్ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుతానికి లారెన్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ, ట్విట్టర్ లో ఆయన లేటెస్ట్ గా వేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య కాలంలో తిరుచ్చి స్థానం నుండి నేను పోటీ చేయబోతున్నట్టు మీడియా లో కథనాలు ప్రచారం అయ్యాయి. ఇందులో నిజానిజాలు ఏంటో చెప్పమని మీడియా మిత్రులు కొంతమంది నన్ను సంప్రదించారు. ఈ కథనాలు ఇప్పుడు తారా స్థాయికి చేరుకొని , నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవ్వడం తో నేను స్పందించాల్సి వస్తుంది. ప్రస్తుతానికి నేను ‘బెంజ్’ అనే సినిమా లో హీరో గా నటిస్తున్నాను. ఈ సినిమాకు చెందిన షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 10 వ తేదీన ముగియబోతుంది. జూన్ 11 న , నా తల్లి ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటన ని అధికారికంగా చేయబోతున్నాను , గురువారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్.
