https://oktelugu.com/

క్యాస్టింగ్‌ కౌచ్‌లో కూతురుకు మద్దుతు తెలిపిన తల్లి

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా రాధికా శరత్ కుమార్ మద్దుతు నిలిచారు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ విషయంలో వరలక్ష్మి కరెక్టుగానే రియాక్టయిందని రాధిక అన్నారు. ఈ విషయంలో తన కూతురుకు మరింత బలం చేకూరాలని ఆశిస్తున్నానని రాధిక ట్విట్టర్లో పేర్కొంది. వరలక్ష్మి 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానుల కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. స్టార్ కిడ్ అయిన తనకు కూడా క్యాస్టించ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 3, 2020 / 11:06 AM IST
    Follow us on

    క్యాస్టింగ్‌ కౌచ్‌ పై వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా రాధికా శరత్ కుమార్ మద్దుతు నిలిచారు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ విషయంలో వరలక్ష్మి కరెక్టుగానే రియాక్టయిందని రాధిక అన్నారు. ఈ విషయంలో తన కూతురుకు మరింత బలం చేకూరాలని ఆశిస్తున్నానని రాధిక ట్విట్టర్లో పేర్కొంది.

    వరలక్ష్మి 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానుల కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. స్టార్ కిడ్ అయిన తనకు కూడా క్యాస్టించ్ కౌచ్ సంఘటనలు ఎదురైనట్లు చెప్పింది. అలాంటి వారు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని చెప్పింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

    అలాంటి వారి సినిమాల్లో తాను న‌టించాల్సి అవ‌స‌రం లేదనిపించిందని చెప్పింది. అందుకే తనను బ్యాన్ చేశారని చెప్పింది. అయినా నేడు ఎవరికీ భయపడకుండా తన కాళ్ల‌పై నేను నిల‌బ‌డిగ‌లిగానని చెప్పింది. ఇలాంటి విషయాలపై మహిళలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం వరలక్ష్మి ‘కన్నిరాశి’, ‘వెల్వెట్‌ నగరం’, ‘డాని’ తదితర చిత్రాలతో బిజీగా ఉన్నారు.