https://oktelugu.com/

భర్తతో కలిసి బాలీవుడ్ భామ గుర్రపుస్వారీ

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి బీచ్‌లో గుర్రపుస్వారీ చేశారు. 2018లో ప్రియాంక అమెరికా ప్రముఖ పాప్ గాయకుడు నిక్ జోనాస్ ను వివాహమడింది. పెళ్లయిన నాటి నుంచి ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ లు తమ సంతోషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ప్రియాంక తన భర్తతో బీచ్ లో గుర్రపుస్వారీ చేస్తూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రాలు ప్రస్తుతం వైరల్ […]

Written By: , Updated On : March 3, 2020 / 11:11 AM IST
Follow us on

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి బీచ్‌లో గుర్రపుస్వారీ చేశారు. 2018లో ప్రియాంక అమెరికా ప్రముఖ పాప్ గాయకుడు నిక్ జోనాస్ ను వివాహమడింది. పెళ్లయిన నాటి నుంచి ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ లు తమ సంతోషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ప్రియాంక తన భర్తతో బీచ్ లో గుర్రపుస్వారీ చేస్తూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కౌబాయ్ టోపీలు ధరించి సరదాగా గుర్రపుస్వారీ చేయడం ఆకట్టుకుంది. నిక్ జోనాస్ తెల్లగుర్రంపై, ప్రియాంక చోప్రా నల్లగుర్రంపై ఒకరికొకరు చేతులు పట్టుకుని సరదాగా గుర్రపుస్వారీ చేసి బీచ్ లో కాసేపు సేద తీరింది. ఆనందంగా బీచ్ లో చేసిన హార్స్ రైడింగ్ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

2018 డిసెంబరులో వీరిద్దరు హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. వీరి అన్యోన్య జీవితానికి అద్దంపట్టేలా ఈ చిత్రాలు కన్పిస్తున్నాయి. వీరిద్దరు వైవాహిక జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కౌబాయ్ గెటప్ లో వీరి జంట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అభిమానులు ఈ ఫోటోలను షేర్స్ చేస్తుండటంతో వైరల్ గా మారాయి.