Radhika Apte: తెలుగు సినిమాల్లో గ్లామర్ గా కనిపించే తారలు కొందరే. వారిలో కొందరిని ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకుంటే కొందరిని మాత్రం తొందరగానే మరిచిపోతారు. అలనాటి నటి శ్రీదేవిని ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటారంటే ఆమె అందం అలాంటిది. అలాంటి అందం ఉన్న వారిని తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారు. అదే కోవలో తెలుగులో నటించిన హీరోయిన్ రాధికా ఆప్టే కూడా ఒకరు. తన అందంతో పాటు నటనతో కూడా మంచి మార్కులు కొట్టేసింది. చేసిన సినిమాలు తక్కువే అయినా రావాల్సిన గుర్తింపు మాత్రం వచ్చేసింది. దీంతో ఆమె తెలుగులో నటించి మెప్పించేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఆమధ్య వచ్చిన రక్త చరిత్రలో పరిటాల సునీత పాత్ర పోషించి అందరిని మెప్పించింది. అలాగే బాలకృష్ణతో లెజెండ్, లయన్ చిత్రాలు తీసి తన నటనకు భాష్యం చెప్పింది. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఆమె మళ్లీ తెలుగులో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కొన్ని సినిమాలకు నిర్మాతలు ఆమెను సంప్రదించగా కథా చర్చలు నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె తిరిగి తెలుగులో నటించి తన నటనకు కొత్తదనం చూాలని చూస్తోంది.
Also Read:Konaseema: అమలాపురం అల్లర్లు.. వైసీపీ నేతలే నిందితులు.. వాళ్లు ఎవరో తెలుసా?
అందాలు ఆరబోయడంలో కూడా ఈ అమ్మడు ముందే ఉంటుంది. గతంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన ఈ భామ ప్రస్తుతం మళ్లీ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. బికినీతో ఉన్న ఫొటోను షేర్ చేయడంతో కుర్రకారు గుండెలు పిండేస్తోంది. ఆమె అందాలు చూస్తూ యువత సొల్లు కార్చుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారడంతో అభిమానులకు పండగే అవుతోంది. ఒళ్లు చూపించుకోవడంలో ఈ మధ్య హీరోయిన్లు పోటీ పడుతున్నారు.

ఇందులో భాగంగానే రాధికా ఆప్టే పలు భాషల్లో నటించి తానేమిటో నిరూపించుకుంది. హిందీ, మలయాళం, బెంగాలీ, కన్నడ, తెలుగు భాషల్లో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుంది. బాలయ్యతో నటించిన రెండు సినిమాలు లెజెండ్, లయన్ మంచి గుర్తింపును తెచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. కానీ ఆమె ఇలా బికినీలలో కనిపిస్తుంటే కొందరు విమర్శలు చేస్తున్నా కొందరు మాత్రం సంబరపడుతున్నారు. ఆమె అందాలను తనివి తీరా చూస్తున్నారు. రాధికా ఆప్టే కూడా ఇలాంటి పనులు చేస్తుండటంపై అభిమానుల్లో సందేహాలు కూడా వస్తున్నాయి.
Also Read:Sukrithi : ‘కేరింత’ హీరోయిన్ సుకృతి నిశ్చితార్థం.. ఎవరిని చేసుకోబోతోందో తెలుసా?