https://oktelugu.com/

Tollywood Release Dates: రాధేశ్యామ్’, ‘రామారావు’, ‘కేజీఎఫ్ -2’ రిలీజ్ డేట్స్ ఫిక్స్ !

Tollywood Release Dates: ‘కరోనా’ మూడో వేవ్ పెద్దగా ప్రభావం చూపడం లేదనే అభిప్రాయానికి వచ్చారు సినిమా వాళ్లు. దాంతో విచ్చలవిడిగా సినిమాల రిలీజ్ డేట్లు వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 11న థియేటర్లలో ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇక మరో […]

Written By: , Updated On : February 2, 2022 / 12:10 PM IST
Follow us on

Tollywood Release Dates: ‘కరోనా’ మూడో వేవ్ పెద్దగా ప్రభావం చూపడం లేదనే అభిప్రాయానికి వచ్చారు సినిమా వాళ్లు. దాంతో విచ్చలవిడిగా సినిమాల రిలీజ్ డేట్లు వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 11న థియేటర్లలో ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

Tollywood Release Dates

Radhe Shyam

ఇక మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా కన్నడ సూపర్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘కేజీఎఫ్ -2’. దేశ వ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తుండగా.. ఏప్రిల్ 14న విడుదల చేస్తామని యూనిట్ గతంలో ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే డేట్‌కు ఫిక్సయింది. తాజాగా ఉడిపిలోని మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న యూనిట్.. సినిమాను ‘ఏప్రిల్ 14’నే విడుదల చేస్తామని పేర్కొంది.

Tollywood Release Dates

KGF 2

Also Read: ఆ బాధను ఆ ఫ్యామిలీ అనుభవించాలి.. రష్మీలో విప్లవం !

ఇక మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘ఖిలాడీ’ మూవీ రిలీజ్‌కు రెడీ కాగా.. తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మార్చి 25 లేదా ఏప్రిల్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తొట్టెంపూడి వేణు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు.

Tollywood Release Dates

Tollywood Release Dates

కాగా శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మొత్తానికి ఇలా వరుస రిలీజ్ డేట్లు వచ్చి పడుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Also Read: విషాదం : తల్లిని కోల్పోయిన ఒకప్పటి అందాల తార !

Tags