Radhe Shyam First Review: తారాగణం : ప్రభాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, సత్యరాజ్, సచిన్ ఖేదేకర్, భాగ్యశ్రీ తదితరులు.

దర్శకత్వం : కె.రాధాకృష్ణ,
కథా రచయిత : కె.రాధాకృష్ణ కుమార్,
ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస,
కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు,
సంగీతం, నేపధ్య సంగీతం: జస్టిన్ ప్రభాకరన్,
నిర్మాతలు : భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్.
Also Read: భీమ్లా నాయక్’ పాటల జ్యూక్ బాక్స్ రిలీజ్
Radhe Shyam First Review
‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాంతో సినిమాలో అదనపు హంగులు కోరుకుంటారనే.. మేకర్స్ ఈ సినిమాని అన్ని ఎమోషన్స్ తో నింపేశారు. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మరి, ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం
కథ :
విక్రమాదిత్య (ప్రభాస్) లండన్ లో ఫేమస్ పామిస్ట్. విక్రమాదిత్య భారత్ లో పుట్టినా చిన్నతనంలోనే ఫ్యామిలీతో లండన్ వెళ్లాల్సి వస్తోంది. అయితే, అతనికి జాతకం చెప్పడం చిన్నతనం నుంచి ఉన్న అలవాటు. ఆ అలవాటు కారణంగానే విక్రమాదిత్య లండన్ లో బాగా ఫేమస్ అవుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య విక్రమాదిత్య (ప్రభాస్), ప్రేరణ (పూజా హెగ్డే) ను చూసి ప్రేమలో పడతాడు. మరి ఆమె ప్రేమను గెలుచుకోవడానికి విక్రమాదిత్య ఏమి చేశాడు ? అసలు వీరి ప్రేమలో వచ్చిన సమస్య ఏమిటి ? వీరి ప్రేమకు పరమహంస (కృష్ణం రాజు) ఎలా ఉపయోగ పడ్డారు ? అసలు 106 మంది ప్యాసింజర్లతో రోమ్ కి బయలుదేరిన ట్రైన్ కి.. విక్రమాదిత్య – ప్రేరణ ప్రేమకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :

హాలీవుడ్ మేకర్స్ కూడా షాక్ అయ్యేలా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రివ్యూ వచ్చేసింది. సినిమా చూసిన ప్రేక్షకులు విజిల్స్ తో కేకలతో ఊగిపోతున్నారు. ప్రేక్షకుల్లో ఎక్కువమంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. ‘రాధేశ్యామ్’ ప్రపంచస్థాయి సినిమా అని.. సింపుల్ గా ‘రాధేశ్యామ్’ హాలీవుడ్ రేంజ్ సినిమా అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ -పూజల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది.
ఇక కథ విషయానికి ఇది ఒక యూనిక్ సబ్జెక్టు. అలాగే ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ వండర్. ఈ క్లైమాక్స్ ను ముందే ఏ ప్రేక్షకుడు ఊహించలేడు. అసలు ఈ ఊహించని రీతిలో క్లైమాక్స్ ను డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే.
సెకండ్ హాఫ్ లో ప్రభాస్ డ్రెస్సింగ్.. యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. క్లాస్ లో అలాగే స్టైల్ లో ప్రభాస్ ను బీట్ చేసే వారు లేరని.. ప్రభాస్ మరోసారి ఘనంగా నిరూపించాడు. క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’ గా సాగుతూ ‘రాధేశ్యామ్’ అబ్బుర పరుస్తోంది.
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్ స్టార్ డమ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్సీ,
పూజా హెగ్డే గ్లామర్ అండ్ క్రేజ్,
భారీ విజువల్స్,
ఎమోషనల్ సీన్స్,
యాక్షన్ సీన్స్.
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్,
స్లోగా సాగే యాక్షన్ సీన్స్,
సినిమాలో సినిమాటిక్ వ్యూ మరీ ఎక్కువ అవ్వడం.
సినిమా చూడాలా ? వద్దా ?
ప్రభాస్ ఫ్యాన్సే కాదు.. ప్రతి ప్రేక్షకుడు సినిమా హ్యాపీగా చూడొచ్చు. సినిమాలో అద్భుతమైన యాక్షన్, వండర్ ఫుల్ ఎమోషన్స్ మిక్స్ చేసి ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మలిచారు. పైగా ఆ లవ్ లో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ను డిజైన్ చేశారు. సినిమా ఆకట్టుకుంది. కాకపోతే, స్లో నేరేషన్, ప్లే ఒకింత నిరాశపరిచే అంశాలు కొన్నిచోట్ల ఇబ్బంది పెడుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా మెప్పిస్తోంది.
Also Read: ఆర్ఆర్ఆర్’ అలా చూస్తే కిక్కు ఏముంటుంది.. ఇలా చూడండి