Prabhas Radhe Shyam Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. ‘భీమ్లానాయక్’ మూవీ తర్వాత వస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. బాహుబలి, సాహోలతో ప్రభాస్ మార్కెట్ ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.

ఇక ఇటీవల విడుదలైన ‘రాధేశ్యామ్’ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఆద్యంతం ఆసక్తికలిగేలా టీజర్ ను కట్ చేశారు. చేతి గీతలు చూసి అందరి జాతకం చెప్పే ఒక శక్తి కలిగిన యువకుడిగా ప్రభాస్ ఇందులో కనిపిస్తున్నారు. హీరో అందరి జాతకాలు ముందే చెబుతూ ఒక గురూలా మారిపోతాడు. ఇక తన జీవితంలో జరగబోయేది ఊహించాడా? ముందే తెలిసిందా? పూజాహెగ్డేతో ప్రేమకథ ఏమైందన్నది సస్పెన్స్ లా పెట్టేశారు.
Also Read: Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్
అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాధేశ్యామ్ మూవీ ఫస్ట్ కాపీని కొందరు ప్రముఖులకు చూపించారని అది అద్భుతంగా వచ్చిందని టాక్ నడుస్తోంది.

నిజానికి దీన్ని ఒక ప్రేమకథగా అందరూ భావిస్తున్నారని.. కానీ ప్రకృతి వైపరీత్యం ఎంతటి ప్రభావం చూపిస్తుందన్నది ఈ కథలో మెయిన్ థీమ్ అని సమాచారం. ఇందులో జగపతి బాబు నటన హైలెట్ అంటున్నారు. ఈ దెబ్బతో జగపతిబాబుకు ప్యాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు వస్తాయని.. అతడికి మంచి మార్కెట్ ఏర్పడుతుందని చెబుతున్నారు.
ప్రియురాలిని దక్కించుకునే కోణంలో ప్రభాస్ ప్రయత్నిస్తుంటే ప్రకృతి ప్రకోపానికి ఈ ప్రేమ జంట ఏమైందన్నది అసలు కథ అని ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఈ లీకులు బయటకు రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Also Read: Balakrishna Wife Vasundhara: బాలయ్య భార్య వసుంధర ఎవరి కూతురు.. ఆమె ఆస్తి విలువ ఎంతంటే?
[…] Also Read: రాధేశ్యామ్ టాక్ లీక్.. ఎలా ఉందంటే? […]
[…] DJ Tillu OTT: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘డీజే టిల్లు’. ఇక ఈ సినిమాకి ‘అట్లుంటది మనతోని’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయిక నటించింది. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగానే.. ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. కాగా ఈ డీజే టిల్లు సినిమా తాజాగా ఓటీటీలో విడుదలైంది. […]