Radhe Shyam Movie Review: భారీ పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ రివ్యూ వచ్చేసింది. నిన్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే, సెన్సార్ రిపోర్ట్ బయట పడకుండా చిత్రబృందం జాగ్రత్త పడినా.. సెన్సార్ రివ్యూను మాత్రం ఆపలేకపోయారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా ఎలా ఉందో చెప్పేశారు.
ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు ‘రాధేశ్యామ్’ సెన్సార్ రివ్యూ ఇచ్చేశాడు. “ప్రభాస్ క్లాస్ ను, అలాగే ప్రభాస్ స్టైల్ ను భారత్ లో ఎవరూ బీట్ చేయలేరు. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి. ప్రభాస్, పూజాహెగ్డే కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ‘రాధేశ్యామ్’ అద్భుతమైన ఎమోషనల్ మూవీ.
Also Read: భీమ్లానాయక్ 11వ రోజు కలెక్షన్స్.. మళ్లీ మైండ్ బ్లాంక్
ఇక క్లైమాక్స్ ఓ అద్భుతమైన అనుభూతి. ఎవరూ ఊహించనంతగా ఉంది. క్లైమాక్స్ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. మాటల్లో చెప్పలేను’ అంటూ ఉమైర్ సంధు చెప్పుకొచ్చాడు. ఫిల్మ్ క్రిటిక్ గా ఉమైర్ సంధుకు మంచి నేమ్ ఉంది. గతంలో అతను ముందుగానే ‘దంగల్, బాహుబలి 2’ సినిమాల విషయంలో ఇలాగే రివ్యూ ఇచ్చాడు. అవి నిజం అయ్యాయి కూడా.
కాబట్టి ‘రాధేశ్యామ్’ విషయంలో కూడా నిజం అవుతుందని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. అలాగే మరో తెలుగు సెన్సార్ సభ్యుడు కూడా ఈ సినిమా గురించి స్పందిస్తూ.. ‘సినిమా యాక్షన్ మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దాంతో సినిమాలో అదనపు హంగులు కోరుకుంటారనే.. మేకర్స్ ఈ సినిమాని అన్ని ఎమోషన్స్ తో నింపేశారు. పైగా రాధేశ్యామ్‌లో వరల్డ్‌లోనే ఫేమస్ పామిస్ట్‌గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇక ప్రభాస్ – పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీతో పాటు ప్రభాస్ లుక్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయట. అన్నట్టు పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపించబోతున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. లండన్ ఫేమస్ పామిస్ట్ విలియమ్ జాన్ వార్నర్ జీవిత కథ ఆధారంగా రాధేశ్యామ్‌ని మలచినట్టు తెలుస్తోంది. అతడు భారత్‌లో జాతకం చెప్పడం నేర్చుకొని, లండన్‌లో ఫేమస్ అయ్యాడు. రాధేశ్యామ్ కథ అధిక భాగం 1970ల్లో జరుగుతుండగా, చివరి అరగంట చాలా ఆసక్తిగా సాగుతుందని సమాచారం.
Also Read: తన సినిమాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్